Thursday, January 23, 2025

జివొ3తో మహిళలకు అన్యాయం: కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజ్యాంగం వచ్చిన తర్వాత మహిళల కోసం అనేక చట్టాలు చేసుకుంటున్నామని ఎంఎల్ సి కవిత తెలిపారు. మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పోలీస్ శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని, ప్రతి యూనివర్సిటీ లో మహిళల సంఖ్య పెరిగిందని, పోటీ పరీక్షల్లో మహిళలే టాప్ లో ఉంటున్నారని ప్రశంసించారు. ఇందిరా పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఎంఎల్సీ కవిత ధర్నా చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయం, జిఒ 3ని రద్దు చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.  33 శాతం మహిళ రిజర్వేషన్లు కావాలని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కోరారని, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కానీ జిఒ3 తీసుకొచ్చి ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.

జిఒ3తో మహిళలకు కేవలం 12 శాతం రిజర్వేషన్లు మాత్రమే వస్తాయని చెప్పారు. ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తి సిఎం రేవంత్ రెడ్డి అని, ఒక కోర్టుకు కాకపోతే మరో కోర్టుకు వెళ్లే వ్యక్తి రేవంత్ అని కవిత ధ్వజమెత్తారు. ఈ జివొతో మహిళలకు అన్యాయం జరుగుతుందని, అవసరం అయితే సుప్రీం కోర్టుకు వెళ్తానని హెచ్చరించారు. మహిళలకు వ్యతిరేకంగా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, పిజిటి, జెఎల్ పోస్టులలో కూడా మహిళలకు అన్యాయం జరుగుతోందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను కలవటం లేదని కెసిఆర్ ను విమర్శించిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఎందుకు ప్రజలకు కనడపడం లేదని ప్రశ్నించారు. ఆయన ఢిల్లీ నేతలనే కలుస్తారని, తెలంగాణ ప్రజలను కలవరని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, భారత్ జాగృతి శ్రేణులు పాల్గొన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News