Monday, January 20, 2025

బిజెపికి మెజార్టీ ఉంది… మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టండి: కవిత

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: దీక్షకు మద్దతు తెలుపుతున్న అందరికీ కవిత కృతజ్ఞతలు తెలిపారు. జంతర్‌మంతర్‌లో ఎంఎల్‌సి కవిత నిరాహార దీక్ష చేపట్టారు. ఎంఎల్‌సి కవిత జాతీయ నేతల విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ సాధించే వరకూ విశ్రమించేదే లేదన్నారు. బిజెపి ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉందన్నారు. బిజెపి బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయని, జంతర్ మంతర్‌లో మొదలైన పోరాటం దేశమంతా వ్యాపించాలన్నారు.

మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం ఎంఎల్‌సి కవిత దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపి కవిత, ఎంఎల్‌ఎ పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. కవిత దీక్షకు మద్దతుగా సిపిఎం నేత సీతారాం ఏచూరి హాజరయ్యారు. భారత్ జాగృతి దీక్షలో మహిళా నేతలు పాల్గొన్నారు. దీక్షకు 13 పార్టీలు మద్దతు తెలిపినట్లు భారత్ జాగృతి ప్రకటించింది. సాయంత్రం నాలుగు గంటల వరకు కవిత దీక్ష చేయనున్నారు. దీక్షలో కవితతో పాటు వివిధ పార్టీల మహిళా నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News