Wednesday, January 22, 2025

యూత్‌ను అలరించే ‘ఉస్తాద్’..

- Advertisement -
- Advertisement -

శ్రీ సింహ కోడూరి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ఉస్తాద్’. కావ్యా కళ్యాణ్ రామ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం, క్రిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై ఫణిదీప్ దర్శకత్వంలో రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హీరోయిన్ కావ్యా కళ్యాణ్ రామ్ మీడియాతో మాట్లాడుతూ.. “ఈ సినిమాలో సూర్య అనే పాత్రలో శ్రీసింహ కనిపించబోతున్నారు.

హీరో తన బైక్‌ను ఉస్తాద్‌ను అని పిలుచుకుంటాడు. తను టీనేజర్ నుంచి యువకుడిగా ఎదగడం, పైలట్‌గా జాబ్ సంపాదించడం అనేది ఈ సినిమాలో ప్రధానాంశం. ఇందులో సూర్య ప్రేయసి మేఘన పాత్రలో నేను నటించాను. తను మానసికంగా తను చాలా బలవంతురాలు. తన క్యారెక్టర్ చాలా మంది అమ్మాయిలకు కనెక్ట్ అవుతుంది. ఇక ‘ఉస్తాద్’ సినిమా యూత్‌ను ఎంతగానో అలరిస్తుంది” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News