Friday, November 22, 2024

కావ్య మారన్ మంచి మనసు…స్పోర్టివ్ స్పిరిట్… మాటల్లో చెప్పలేం!

- Advertisement -
- Advertisement -

చెన్నై: సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్య మారన్. ఆమెది ఎంత మంచి మనస్సో మాటల్లో చెప్పలేము. ఐపిఎల్02024లో తన జట్టు ఫైనల్ దాకా వెళ్లి ఓడిపోతే…తనలో తాను ఏడ్చిందే తప్ప ఎవరినీ పల్లెత్తు మాట అనలేదు.

ఎస్ఆర్ హెచ్ టీమ్ ఓడిపోయాక ఆమె జట్టు డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి అందరినీ పలుకరించింది. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తో మాట్లాడింది. అందరితో కలిసిపోయి మాట్లాడినప్పటికీ ఆమె తన టీమ్ ఓడిపోయిన బాధను వ్రెల్లగక్కలేదు. ఆమె సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడిన అన్ని మ్యాచ్ లకు హాజరయింది. ఈ సీజన్ లో జట్టు సాధించిన ఘనతకు ఆమె జట్టులోని ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపింది. ‘‘ మీరంతా గర్వించేలా ఆడారు. అది చెప్పడానికే నేను మీ డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చాను. నిజంగా మీరు టి20 క్రికెట్ కు ఓ కొత్త నిర్వచనం పలికారు. అంతా మన టీమ్ గురించే మాట్లాడుకుంటున్నారు. మీరు బ్యాటింగ్, బౌలింగ్ రెండింట మంచి ప్రదర్శన కనబరిచారు. మనం గత ఏడాది పట్టికలో చివరలో ఉన్నప్పటికీ ఈ ఏడాది చివరికంటా గెలుస్తూ వచ్చాము. మీ ఆట నుంచి చూడడానికి అభిమానులు దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు’’ అంటూ చెప్పింది. ఆమె అవివాహిత కావడంతో కొందరు పోకిరులు ఆమెకు ఎవరెవరితోనే లింక్ లు  పెట్టి మానసిక క్షోభను కలిగించారు. అయినా ఆమె రత్నంలా మెరిసిందే తప్ప కుంచించుకు పోలేదు.

హైదరాబాద్ జట్టు తొలుత బ్యాటింగ్ లో, తర్వాత బౌలింగ్ లో చతికిల పడిపోయినందున కప్ దక్కించుకోలేకపోయింది. రన్నరప్ గానే మిగిలిపోయింది.

కావ్యమారన్ డ్రెస్సింగ్ రూమ్ లో ఆటగాళ్లతో మాట్లాడుతూ ‘‘ ప్రతి ఒక్కరు మన గురించే మాట్లాడుతున్నారు. కోల్ కతా నైట్ రైడర్స్ గెలిచినప్పటికీ… మన జట్టు ఆటతీరు గురించే మాట్లాడుతున్నారు. థాంక్యూ గయ్స్, టేక్ కేర్. ఇలాగే ఉండిపోకండి. మనం ఫైనల్స్ లో ఆడాము. ఇది ఇతర ఆటల మాదిరి కాదు’’ అంటూ ప్లేయర్స్ తో అన్నది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News