Monday, January 20, 2025

అదే పెద్ద చాలెంజింగ్ అనిపించింది: కావ్య థాపర్

- Advertisement -
- Advertisement -

గోపీచంద్, కావ్యథాపర్ జంటగా డైనమిక్ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం విశ్వం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. వేణు దోనేపూడి, టిజి విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సిని మా ఈనెల 11న థియేటర్ లో విడుదల కాబోతుంది.

ఈ సందర్భంగా కావ్యథాపర్ విలేకకరుల సమావేశంలో మాట్లాడుతూ “విశ్వంలో నా పాత్ర చాలా కొత్తగా వుంటుంది. ఇందులో అన్నీ వైవిధ్యంగా వుంటాయి. 16 మంది కమేడియన్స్ ఇందులో వున్నారు. టీజర్ లో చూసిన ట్లు వెన్నెల కిశోర్, విటి గణేష్ వంటివారు ఇందులో నటించారు. టెక్నికల్‌గా చైతన్య భరద్వాజ సంగీతం బాగుంది. పాటలు ఇప్పటికే బిగ్ హిట్ అయ్యాయి. నా క్యారెక్టర్ భిన్నంగా డిజైన్ చేశారు. దర్శకడు శ్రీనువైట్ల సన్నివేశపరంగా సీన్స్ చెప్పి నాచేత చేయించడం అనేది పెద్ద చాలెంజింగ్ అనిపించింది. ఆయన అన్ని విషయాల్లో ఫర్‌ఫెక్ట్‌గా వుంటారు. మోడ్రన్‌గా వుండే నేటి ట్రెండ్‌కు తగిన అమ్మాయిని. కనుకనే కాస్ట్యూమ్స్ పరంగా కేర్ తీసుకోవాల్సి వచ్చింది.గోపీచంద్ చాలాకామ్‌గా వుంటారు. తన పనేదో తాను చేసుకుంటారు. అందుకు భిన్నమైన కారెక్టర్ నాది. అందుకే ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. అంకిత భావానికి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఈ సినిమాలో చాలా పాత్రలున్నాయి. అందరినీ మోటివేట్ చేయడమంటే మాటలు కాదు. ప్రతివారి నుంచి ఔట్ పుట్ రాబట్టుకోవాలి. ఒకరకంగా చెప్పాలంటే శ్రీను వైట్ల వల్లే నేను బాగా నటించగలిగాను. విశ్వం చాలా కొత్తగా వుంటుందని చెప్పగలను. రెండు పాటలున్నాయి. రెండూ నాకు బాగా నచ్చాయి. ఒకటి శేఖర్ మాస్టర్, మరోటి శిరీష్ మాస్టర్ కంపోజ్ చేశారు. డాన్స్ వేయడంలో చాలా మెళకువలు నేర్చుకున్నా” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News