Monday, January 20, 2025

బోల్డ్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్‌తో అలరిస్తా: కావ్య థాపర్

- Advertisement -
- Advertisement -

ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్‌లో మోస్ట్- వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. పూరి కనెక్ట్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ గ్రాండ్‌గా నిర్మించిన ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా కావ్య థాపర్ నటించింది. డబుల్ ఇస్మార్ట్ సినిమా ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ కావ్య థాపర్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

చాలా థ్రిల్ ఇచ్చింది…
ఇంత అద్భుతమైన కాంబినేషన్ వున్న సినిమాలో వర్క్ చేయడం చాలా లక్కీగా ఫీలవుతున్నాను. రామ్, సంజయ్ దత్ లాంటి బిగ్ స్టార్ కాస్ట్ వున్న సినిమాలో నేనూ పార్ట్ కావడం చాలా హ్యాపీగా వుంది. అలాగే పూరి, మణిశర్మ కాంబో చాలా ఫేమస్. అలాంటి కాంబోలో వర్క్ చేయడం చాలా థ్రిల్ ఇచ్చింది.
పూరి గ్రేట్ డైరెక్టర్…
నాకు పూరి జగన్నాథ్ సినిమాలో హీరోయిన్ అవ్వాలని వుండేది. ఇస్మార్ట్ శంకర్ సినిమాకి ఆడిషన్ ఇచ్చాను కానీ కుదరలేదు. ఇప్పుడు డబుల్ ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ వుండే ఈ సినిమాలో అవకాశం రావడం మరింత హ్యాపీగా వుంది. పూరి గ్రేట్ డైరెక్టర్. ఆయన విజన్ చాలా అద్భుతంగా వుంటుంది.

బోల్డ్ అండ్ స్ట్రాంగ్‌గా…
ఇందులో నా క్యారెక్టర్ చాలా బోల్డ్ అండ్ స్ట్రాంగ్‌గా వుంటుంది. ఇందులో నాకు ఫైట్ సీన్స్ కూడా వున్నాయి. ఒక యాక్టర్‌గా ఎప్పటినుంచో ఇలాంటి క్యారెక్టర్ చేయాలని కోరుకున్నాను. ఈ సినిమాతో అలాంటి క్యారెక్టర్ రావడం ఆనందంగా వుంది. ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను.

చాలా విషయాలు నేర్చుకున్నా…
ఈ సినిమాలో రామ్‌తో డ్యాన్స్ చేయడం బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. ఆయన చాలా పాషనేట్ యాక్టర్, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. హైలీ ఎనర్జిటిక్‌గా వుంటారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. మా కెమిస్ట్రీ ది బెస్ట్ వచ్చింది. సంజయ్ దత్‌తో వర్క్ చేయడం మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన లెజండరీ యాక్టర్. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం డ్రీమ్ కమ్ ట్రూలా అనిపించింది.
లక్కీగా భావిస్తున్నా…
ఈ సినిమాలో మార్ ముంత ఛోడ్ చింతా, స్టెప్ మార్ నా ఫేవరేట్. అవి నా మైండ్ నుంచి పోవడం లేదు. అలాగే క్యా లఫ్డా సాంగ్‌ను కూడా ఎంజాయ్ చేశాను. -మణిశర్మ లెజండరీ కంపోజర్. ఆయన సాంగ్స్‌కి డ్యాన్స్ చేయడం లక్కీగా భావిస్తున్నాను. ఇక ప్రస్తుతం గోపిచంద్‌తో విశ్వం సినిమా చేస్తున్నాను.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News