Saturday, December 21, 2024

అమెరికాలో కాజీపేట యువకుడి దుర్మరణం

- Advertisement -
- Advertisement -

అమెరికాలో మరో తెలుగు యువకుడు కన్నుమూశాడు. కాజీపేటకు చెందిన పిట్టల వెంకటరమణ (27) అనే యువకుడు మార్చిన 9న వెస్ట్ ఫ్లోరిడాలో మరణించాడు. విస్టీరియా ద్వీపం సమీపాన అతను వాటర్ రేసింగ్ చేస్తుండగా ఎదురుగా వచ్చిన మరో వాటర్ బైక్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి చనిపోయినట్లు అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు.

వెంకటరమణ ఫిజియోథెరపీలో డిగ్రీ పూర్తి చేసి, పైచదువులకోసం ఏడాదిన్నర క్రితం అమెరికా వెళ్లాడు. ఇండియానా పోలిస్ లోని పర్ద్యూ యూనివర్శిటీలో ఎంఎస్ చేస్తున్నాడు. అతని తండ్రి కాజీపేటలో రైల్వే గార్డుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News