Sunday, January 19, 2025

చంపారు… యూట్యూబ్ తో ఆధారాలు లేకుండా చేశారు…

- Advertisement -
- Advertisement -

హనమకొండ: రెండు నెలల క్రితం జరిగిన వృద్ధురాలు హత్య కేసును పోలీసులు చేధించిన సంఘటన కాజీపేటలోని రహమత్ నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కన్నె విజయ (68) అనే మహిళను 2023 డిసెంబర్ 15న హత్యకు గురైంది. వృద్ధురాలిని చంపి రక్తపు మరకలు లేకుండా మృతదేహాన్ని నీళ్లతో కడిగి ఆమె ఇంటి ముందు శవాన్ని పడేసి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గ్రామస్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 60 వేల ఫోన్ కాల్స్ డేటాను పరిశీలించిన ఒక్క ఆధారం పోలీసులకు లభించలేదు. రెండు నెలల తరువాత ఓ ఇంట్లో రక్తపు మరకలు కనిపించడంతో దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సదరు మహిళను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా హత్య చేశానని ఒప్పుకుంది. రెండు నెలల క్రితం అదే కాలనీకి చెందిన ఓ మహిళతో విజయ గొడవ పెట్టుకుంది. అది మనసులో పెట్టుకొని వృద్ధురాలిని నిందితురాలి ఇంట్లోనే చంపారు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఆధారాలు లేకుండా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వృద్ధురాలిపై ఉన్న రక్తపు మరకలను తుడిచి వేసి అనంతరం మృతదేహాన్ని నీళ్లతో కడిగారు. కుటుంబ సభ్యులపై అనుమానం కలిగిలే వృద్ధురాలి ఇంటి ముందు పడేసి అక్కడి నుంచి పారిపోయారు. రెండు నెలల తరువాత కేసు చేధించిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News