Sunday, January 19, 2025

బిజెపి నేతలు.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అస్సాంకు పోయింది… మనకేది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్:  బిజెపి ఎంపిలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకొస్తామని ఇచ్చిన హామీ ఏమైందని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. అస్సాంలోని కోక్రాఝార్ ప్రాంతంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడుతున్నామని ఇండియన్ రైల్వే ట్వీట్ చేసింది. మంత్రి కెటిఆర్ ఆ ట్వీట్‌కు రీట్వీట్ చేసి తెలంగాణ బిజెపి నేతలను ప్రశ్నించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై తెలంగాణ ప్రజలకు బిజెపి నేతలు ఏమని సమాధానం చెబుతారని అడిగారు. కేంద్రం అస్సాంకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కేటాయించినందుకు సంతోషంగా ఉందని చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News