Friday, September 27, 2024

కోటి రూపాయలతో సరిపెట్టుకున్న కెబిసి విన్నర్ !

- Advertisement -
- Advertisement -

ముంబై: అమితాబ్ బచ్చన్ నిర్వహించే ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ఎపిసోడ్-16 మళ్లీ మొదలయింది. ఈ సీజన్ తొలి కంటెస్టెంట్ గా జమ్మూకశ్మీర్ కు చెందిన చందర్ ప్రకాశ్(22) పాల్గొన్నాడు. అతడు యుపిఎస్ సికి తయారవుతున్నాడు. తన జీవితంలో అతడు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు.  అతడు అమితాబ్ బచ్చన్ ఎదురుగా హాట్ సీటులో కూర్చుని క్విజ్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు.

అతడు కోటి రూపాయలు గెలుచుకున్న ప్రశ్న ఏమిటంటే…

దేశంలోని పెద్ద నగరం, అది రాజధాని కాదు, కానీ దానికున్న రేవుపట్టణంకు ‘శాంతి నివాసం’(adobe of peace) అన్న పేరుంటుంది. అది ఏ నగరం?

ఏ) సోమాలియా, బి)ఓమన్, సి)టాంజానియా, డి)బ్రూనీ.

దీనికి చందర్ ‘డబుల్ డిపి’ లైఫ్ లైన్ ఉపయోగించుకుని కరెక్టుగా ‘టాంజానియా’ అని సమాధానం చెప్పాడు. దానికతడు రూ. 1 కోటి గెలిచాడు.

ఆ తర్వాత, రూ. 7 కోట్ల ప్రశ్న ఎదురయింది. ఆ ప్రశ్న…

ఉత్తర అమెరికాలో 1587లో ఇంగ్లీషు తల్లిదండ్రులకు పుట్టిన తొలి రికార్డయిన సంతానం పేరేమిటి? ఆప్షన్లు:

ఏ)వర్జీనియా డేర్, బి)మేరీ థెరెస్సా, సి) హెన్రీ సింక్లయిర్, డి) పెరెగ్రైన్ వైట్.

దీనికి చందర్ రిస్క్ తీసుకోదలచుకోలేదు. దాంతో విరమించుకున్నాడు. ఆ తర్వాత బిగ్ బి గెస్ చేయమని కోరాడు. దానికతడు కరెక్టుగానే ఏ అన్నాడు. నిజానికి అతడు ఆడి ఆ జవాబిచ్చి ఉంటే రూ. 7 కోట్లు గెలుచుకుని ఉండేవాడు. కానీ అతడు రూ. 1 కోటి నగదు, ప్లస్ కారు కే వాకౌట్ చేశాడు.

అతడు ఎందుకు ఆటను కొనసాగించకుండా విరమించుకున్నాడనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అతడి లైఫ్ లైన్లన్నీ అయిపోయాయి. అప్పటికే అతడు గెలుచుకున్నది జీవితాన్ని మార్చేంత డబ్బు. తప్పు చెబితే గెలిచింది కూడా పోతుంది. అందుకే అతడు అక్కడితో ఆపేశాడు. ఇప్పుడు ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ఆడడానికి చాలా మందే ప్రయత్నించొచ్చు. రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం. కెబిసి 16 లో మరెవరైన పెద్ద మొత్తం గెలుస్తారేమో?….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News