Sunday, December 22, 2024

కెబిఆర్ పార్క్ నిందితుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః కెబిఆర్ పార్క్‌కు వాకింగ్‌కు వచ్చిన సినీ మహిళా నిర్మాతతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. బంజారాహిల్స్‌లో ఉండే సినీ మహిళా నిర్మాత రోజు కెబిఆర్ పార్క్‌కు సాయంత్రం వాకింగ్ వస్తుంది. ఈ క్రమంలో ఆమె వాకింగ్ పూర్తి చేసుకుని వెళ్లే సమయంలో వెర్నా కారులో వచ్చే ఓ వ్యక్తి తన ఫోన్‌తో వీడియోలు తీస్తూ, ఆమెకు ఎదురుగా వచ్చి అసభ్యంగా పవర్తించడం చేస్తున్నారు. గతకొంత కాలం నుంచి ఇలాగే చేస్తున్నాడు. వేధింపులు ఎక్కువ కావడంతో సదరు మహిళా నిర్మాత బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. నిందితుడిని గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News