Friday, December 20, 2024

సిల్వర్ జూబ్లీ సందర్భంగా లెన్స్ కెమెరాల్లో ‘కెబిఆర్ పార్క్’

- Advertisement -
- Advertisement -
అద్భుత ఫోటోలకు ఫోటోగ్రాఫర్లకు ఛాన్స్ !

మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కెబిఆర్ పార్కు (కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్) మరో సారి ప్రధాన ఆకర్షణగా నిలువబోతోంది. ఈ డిసెంబర్ 2023తో ఈ పార్కు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అటవీ శాఖలోని వన్యప్రాణి విభాగం కెబిఆర్ పార్కును లెన్స్ కెమెరాల్లో బంధించబోతోంది. సమాజంలోని అన్ని వర్గాల వారిని కలుపుకొని పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న అటవీ శాఖ వణ్యప్రాణి విభాగం కెబిఆర్ పార్కు యొక్క వివిధ అంశాలను క్యాప్చర్ చేయడానికి ఫోటోగ్రాఫర్లకు అవకాశం కల్పిస్తోంది.

“ కెబిఆర్ త్రూ లెన్స్‌” పేరిట కెబిఆర్ పార్కు యొక్క అందమైన చిత్రాలను క్యాప్చర్ చేయడం ద్వారా ఈ ప్రోగ్రామ్‌లో చేరడానికి ఆసక్తి ఉన్న ఫోటోగ్రాఫర్‌లు,నేచురలిస్ట్‌లందరినీ తెలంగాణ అటవీ శాఖ ఆహ్వానిస్తోంది. ముఖ్యంగా వీరు తీసే ఫోటోల్లో కెబిఆర్ పార్కులోని జంతువులు, మొక్కలు, పార్కును సందర్శించే ప్రజలు, అన్నింటికీ మించి ప్రకృతి దృశ్యం తమ ఫోటోల్లో ఉండేలా చూడాలని ఫోటోగ్రాఫర్లకు సూచించింది. ఈ ఫోటోలను తీసేందుకు ఆసక్తిగల ఫోటో గ్రాఫర్లు ఎఫ్‌ఆర్‌ఓ అధికారిణి అనురాధ ఫోన్: 9063986149లో సంప్రదించవచ్చునని తెలిపింది. ఫోటోగ్రాఫర్ల సౌలభ్యం కోసం తమ చిత్రాలను తీయడానికి అవసరమైన సహాయాన్ని తమ ద్వారా పొందవచ్చునని వెల్లడించింది. 2 ఫోటోలు, రిజల్యూషన్..పూర్తి వివరాలను ఈ నెల 28 లోపు జిల్లా forestofficerhyd22@gmail.com మెయిల్‌కు పంపవచ్చని, ఎంపిక చేసిన ఫోటోగ్రాఫ్‌లు ఈ డిసెంబర్‌లోనే కెబిఆర్ సిల్వర్ జూబ్లీ సమయంలో ప్రదర్శనకు ఉంచుతున్నట్లు తెలిపింది. మరింత సమాచారం కోసం ఎఫ్‌ఆర్‌ఓ అధికారి అనురాధ ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని తెలంగాణ అటవీశాఖ వెల్లడించింది.

Peacock

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News