- Advertisement -
హైదరాబాద్: నగరం నడిబొడ్డున పట్టపగలే పార్కు స్థలాన్ని కబ్జా చేసిన సంఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ప్రాంతంలోని కెబిఆర్ పార్క్ సమీపంలో జరిగింది. పార్కింగ్ కాంప్లెక్స్ పేరుతో నిర్మాణదారులు బరితెగించారు. రాత్రికి రాత్రే కెబిఆర్ బయట జిహెచ్ ఎంసి వాక్ వే ప్రహరీ గొడను కూల్చి కొత్తగా గోడను నిర్మిస్తున్నారు. బల్దియా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. వాళ్లకు కేటాయించిన స్థలం కంటే ముందుకు జరిగి పార్కు స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. ఇంత జరుతున్న జిహెచ్ఎంసి అధికారులు నిద్రమత్తులో ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
- Advertisement -