Wednesday, January 22, 2025

బిఆర్ఎస్, బిజెపి మిలాఖత్

- Advertisement -
- Advertisement -
మిషన్15 లక్ష్యం
నిర్లక్ష్యం వీడండి…
ప్రచారాన్ని పరుగెత్తించండి
సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి
నియోజకవర్గాలపై ప్రధాన దృష్టి
పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకోండి
త్వరలో రాష్ట్రానికి చెందిన ఓ ముఖ్యనేత
కాంగ్రెస్‌లో చేరిక బిజెపి, బిఆర్‌ఎస్
తెలంగాణకు చేసిన మోసాన్ని ప్రజల్లో
ఎండగట్టండి అసెంబ్లీ ఎన్నికలను
ప్రాతిపదికగా తీసుకొవద్దు భారీ
బహిరంగసభలకు ఎఐసిసి పెద్దలు వస్తారు..
జనసమీకరణపై దృష్టి పెట్టండి
పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన
వ్యూహంపై రాష్ట్ర నేతలకు ఎఐసిసి ప్రధాన
కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ దిశానిర్దేశం
రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌తో
ప్రత్యేక భేటీ మూడు పెండింగ్ స్థానాల
అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయ సేకరణ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో లోక్‌సభ ఎ న్నికల్లో బిఆర్‌ఎస్, బిజెపి లోపాయికారి ఒప్పందం కు దుర్చుకొని రెండు పార్టీలు అభ్యర్థులను నిర్ణయించాయ ని,ఈ రెండు పార్టీల ఎత్తుగడలకు ధీటైన వ్యూహంతో ముందుకు వెళ్లాలని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వే ణుగోపాల్ సూచించారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్ల సాధనే లక్ష్యంగా ‘మిషన్-15’ పేరిట ప్ర చార క్షేత్రంలోకి దూసుకెళ్లాలని కాంగ్రెస్ నేతలకు ఆ యన పిలుపునిచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకుల తో కెసి వేణుగోపాల్ ఆదివారం సాయంత్రం శంషా బాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో సమావేశ మయ్యారు. ఈ సమావేశానికి సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భ ట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపి అభ్యర్థులు, ఎమ్మెల్యే లు, 17 లోక్‌సభ స్థానాల నియోజకవర్గ ఇన్‌చార్జీలు హా జరయ్యారు. సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి పార్లమెంట్ ని యోజవర్గాలపై ఫోకస్ పెట్టాలని సమావేశంలో నిర్ణ యం తీసుకున్నారు.

పార్టీలోకి ఎవరూ వచ్చినా స్థానిక నేతలతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలని సూ చించారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో త్వరలో ఓ ముఖ్య నేత చేర బోతున్నట్లు ఈ సందర్భంగా ఆయన హింట్ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచార వ్యూహాలపై సమావేశానికి హా జరైన నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. అదే సమ యంలో అభ్యర్థుల బలాబలాలు, ఆయా నియోజకవర్గా ల్లో ప్రచారంలో ముందుకు ఎలా వెళ్లాలన్న దానిపై అభ్యర్థులతో కెసి వేణుగోపాల్ చర్చించినట్టుగా తెలిసింది. దీంతోపాటు కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా ప్రచారం ప్రారంభించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. ఎన్నికల ప్రచారాన్ని త్వరగా ప్రారంభించాలని సూ చించినట్టుగా తెలిసింది. ప్రచారాన్ని ఎందుకు ప్రారంభించలేదు, ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎందుకు వెనుకబడ్డారని కెసి వేణుగోపాల్ అభ్యర్థులను ప్రశ్నించినట్టుగా తెలిసింది. ఎప్పటికప్పుడు అభ్యర్థుల ప్రచారానికి సంబంధించిన నివేదికను తెప్పించుకుంటామని ప్రతి ఒక్కరూ గెలుపుకోసం కృషి చేయాలని కెసి సూచించినట్టుగా సమాచారం. బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు 10 ఏళ్లలో ప్రజలకు చేసిన మోసాన్ని ప్రజలకు అర్థమయ్యే లా వివరించాలని అభ్యర్థులతో కెసి వేణుగోపాల్ పేర్కొన్నట్టుగా సమాచారం.

కష్టపడి మెజార్టీని పెంచుకోవాలి
కాంగ్రెస్ వ్యూహాకర్త సునీల్ కనుగోలు ఇచ్చిన నివేదిక ఆధారంగా అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన అంశాల గురించి కెసి వివరించినట్టుగా తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వేణుగోపాల్ స్థానిక నేతలకు దిశానిర్ధేశం చేసినట్టుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రస్తు తం ప్రకటించిన 14 నియోజకవర్గాల్లో ఉన్న ప్రతిబంధకాలు ఏమిటీ? వాటిని ఎలా అధిగమించాలన్న అంశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలిసింది. దీంతోపాటు పలు నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలకు ఏఐసిసి అగ్రనేతలు వస్తారని దానికి సంబంధించిన ఏర్పాట్లు, జన సమీకరణకు సంబంధించి చేపట్టాల్సిన అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించినట్టుగా సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ వస్తుందన్న అంచనాతో అభ్యర్థులు ఉండవద్దని ఈసారి కూడా కష్టపడి మెజార్టీని పెంచుకోవడానికి అభ్యర్థులు కృషి చేయాలని, దీనికోసం అభ్యర్థులు ఉదయం నుంచి రాత్రి వరకు అలుపెరగకుండా ప్రతి ఇంటికి తిరగాలని అభ్యర్థులకు కెసి వేణుగోపాల్ సూచించారు.

దీపాదాస్ మున్షీతో కెసి వేణుగోపాల్ ప్రత్యేక సమావేశం
ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ మినహా అన్ని సీట్లకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఈ మూ డు సీట్లకు సంబంధించి దీపాదాస్ మున్షీతో కెసి వేణుగోపాల్ ప్రత్యేకంగా సమావేశమయినట్టుగా తెలిసింది. గతంలో ఆ మూడు జిల్లాల కాంగ్రెస్ నాయకులతో ఏఐసిసి నాయకుడు భేటీ అయి అభ్యర్థులు ఎవరైతే బాగుంటుందన్న దానిపై ఆయా జిల్లాల నాయకుల అభిప్రాయ సేకరణ సైతం చే పట్టారు. ప్రస్తుతం వీటిని పరిగణలోకి తీసుకొని అభ్యర్థిని నిర్ణయించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను రెండు రోజుల్లో ఏఐసిసి అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.

బహిరంగ సభలకు ఏఐసిసి అగ్రనేతలు
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఊపు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి లోక్ సభ సీట్లను ఎక్కువ గెలుచుకోవాలన్న లక్షంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఇక్కడకు పార్టీ అగ్రనేతలను ఆహ్వానించడంతో పాటు వారితో భారీ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా అగ్రనేతలతో పాటు ఏఐసిసి నాయకులు సుడిగాలి పర్యటన చేయనున్నట్టుగా కెసి వేణుగోపాల్ అభ్యర్థులతో తెలిపారు. వచ్చే నెలలో నల్లగొండ, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో రెండు భారీ సభల నిర్వహణకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. నల్లగొండ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని మిర్యాలగూడలో, భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని చౌటుప్పల్‌లో ఒకే రోజు జరిగే ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రియాంకగాంధీ హాజరవుతారని సిఎం రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. రాహుల్‌గాంధీ సైతం రాష్ట్రంలో ప్రచారానికి రానున్నారు. దీనికితోడు ఏఐసిసికి చెందిన ముఖ్యనేతలు ఆయా పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పర్యటించనున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News