Sunday, December 22, 2024

పని తీరుతోనే పదవులు

- Advertisement -
- Advertisement -

ఎంఎల్‌ఎలకు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ స్పష్టీకరణ
లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సూచన
సికింద్రాబాద్ ఇన్‌చార్జి మంత్రి కోమటిరెడ్డిపై అసహనం 
మీటింగ్‌కు పలువురి గైర్హాజరుపై అసంతృప్తి 
పార్టీ నిర్ణయాలను ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దు: సిఎం

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే వారికి పదవులు ఉంటాయని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ పేర్కొన్నారు. ఎన్నికలకు మరో ఐదు రోజులే ఉన్నందున రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ కాంగ్రెస్ నాయకులతో జూమ్ ద్వారా అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షీ, మంత్రు లు, ఎమ్మెల్యేలు, లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులు, ఇన్‌చార్జీలు పాల్గొన్నారు. ఈ భేటీకి మంత్రి దామోదర రాజనర్సింహ, 15 మం ది ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంపై కెసి వేణుగోపాల్ అసహనం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప లువురు నేతల పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

గంటకు పైగా సాగిన ఈ జూమ్ మీటింగ్‌లో పార్టీ నేతలకు ఆయన దిశానిర్ధేశం చే శారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల ప్రచారం, నియోజకవర్గాల్లో పా ర్టీల బలాబలాలు తదితరాల అంశాలపై సిఎం రేవంత్ రెడ్డి, విక్రమార్క, దీపాదాస్ మున్షీ, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు వివరించా రు.ఈ సందర్భంగా కెసి వేణుగోపాల్ మాట్లాడుతూ తెలంగాణలో అధిక స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించబోతుందని, అందుకో సం మరింత ఉత్సాహంతో పని చేయాలని ఆయన సూచించారు. తెలంగాణాలో అధిక స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించబోతుందని ఆయన పేర్కొన్నారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అసహనం
నల్గొండ లోక్‌సభ నియోజకవర్గ బాధ్యతను మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి చూసుకుంటారని కెసి వేణుగోపాల్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ స్థానాన్ని నిర్లక్ష్యం చేయటంపై ఇన్‌చార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కెసి వేణగోపాల్ అసహనం వ్యక్తం చేశారు. అభ్యర్థి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆయన నిర్దేశించారు. నియోజకవర్గంలోనే ఉండి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యేలను, మంత్రులను సమన్వయం చేయటంలో సరిగా వ్యవహరించడం లేదంటూ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌పై కెసి వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం ‘దిశా దశ’ మార్చే ఈ ఎన్నికలను ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆయన ఆదేశించారురు. ఎమ్మెల్యేలు ఎవరూ నిర్లక్య ధోరణి ప్రదర్శించ వద్దని కెసి వేణగోపాల్ హెచ్చరించారు.

రాష్ట్రంలోని పరిస్థితులపై రేవంత్ వివరణ
పెండింగ్‌లో ఉన్న రైతుబంధు కూడా ఇప్పటికే పంపిణీ పూర్తి చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ సమావేశంలో వెల్లడించారు. త్వరలో రుణమాఫీ సైతం చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పార్టీ నిర్ధేశించిన పనిని ప్రతి ఒక్కరూ పూర్తి చేయాలని, పార్టీ నిర్ణయాలను ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని సిఎం సూచించారు. జూమ్ మీటింగ్‌లో ఎవరెవరు పాల్గొనలేదో నివేదిక ఇవ్వాలని మహేశ్‌కుమార్ గౌడ్‌ను కెసి వేణుగోపాల్ ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News