Monday, December 23, 2024

కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అసహనం

- Advertisement -
- Advertisement -

నల్గొండ లోక్‌సభ నియోజకవర్గ బాధ్యతను మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి చూసుకుంటారని కెసి వేణుగోపాల్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ స్థానాన్ని నిర్లక్ష్యం చేయటంపై ఇన్‌చార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కెసి వేణగోపాల్ అసహనం వ్యక్తం చేశారు. అభ్యర్థి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆయన నిర్దేశించారు. నియోజకవర్గంలోనే ఉండి గెలుపు కోసం కృషి చేయాలన్నారు.

ఎమ్మెల్యేలను, మంత్రులను సమన్వయం చేయటంలో సరిగా వ్యవహారించడం లేదంటూ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌పై కెసి వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం ‘దిశా దశ’ మార్చే ఈ ఎన్నికలను ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆయన ఆదేశించారురు. ఎమ్మెల్యేలు ఎవరూ నిర్లక్య ధోరణి ప్రదర్శించ వద్దని కెసి వేణగోపాల్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News