Wednesday, December 25, 2024

మూడు రోజుల పాటు కెసిఆర్ 68వ జన్మదిన వేడుకలు

- Advertisement -
- Advertisement -

KCR 68th Birthday Celebrations for three days

 

మన తెలంగాణ/హైదరాబాద్ : టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఈనెల 17న 68వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని టిఆర్‌ఎస్ పార్టీ తలపెట్టింది. ఇందులో భాగంగా మూడు రోజుల పాటు ఈ సంబురాలను ఘనంగా జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ టిఆర్‌ఎస్ నేతలకు ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి తోచిన మేరకు వారు తమ సేవా దృక్పథాన్ని చాటుకునేలా సంబరాలు ఉండాలని స్పష్టం చేశారు. సిఎం జన్మదిన వేడుకల్లో భాగంగా ఈనెల 15న రాష్ట్రవ్యాప్తంగా అన్నదా న కార్యక్రమాలు నిర్వహించాలని కెటిఆర్ సూచించారు. అలాగే ఆస్పత్రు లు, వృద్ధాశ్రమాలు, అనాథశ్రమాలు వంటి చోట్ల పండ్ల పంపిణీ, ఆహారం పంపిణీ, దుస్తుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 16న అన్ని నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించాలన్నారు. ఇక 17వ తేదీన సిఎం జన్మదినం రోజున రాష్ట్రవ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటే కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలన్నారు. ఇవే కాకుండా ప్రతి టిఆర్‌ఎస్ కార్యకర్త తనకు తోచిన విధంగా ఇతరులకు సహాయ పడేందుకు గిఫ్ట్ ఏ స్త్మ్రల్ కార్యక్రమంలో భాగంగా ఏ సేవా కార్యక్రమాన్ని అయినా చేపట్టవచ్చునని ఆయన కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News