మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ జాతిపిత, తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ 70వ జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యా ప్తంగా ఫిబ్రవరి 17న ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ అధినేత, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు నిచ్చారు. ఉద్యమనేత కెసిఆర్ జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ‘ వృక్షార్చన’ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. రాష్ట్రం, దేశం పచ్చ గుండాలనే సంకల్పంతో ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ చేస్తున్న ఈ వృక్షార్చనలో అందరూ భాగస్వాములై , ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి, తెలంగాణ జాతిపిత కెసిఆర్కి జన్మదిన కానుకను ఇద్దామని జోగినపల్లి సంతోష్ కుమార్ వెల్లడించారు.
భవిష్యత్ తరాల సంక్షే మం కోసం పనిచేసే దార్శనిక నేత కెసిఆర్ మానవాళికి పొంచి ఉన్న ముప్పును నివారించేందుకు దేశంలో ఎక్కడాలేని విధంగా ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమాన్ని చేపట్టి. విజయవంతం చేశారన్నారు. తెలంగాణ హరితహారంను దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలిపారన్నారు. చెట్లు నాటడం, పరిరక్షించే కార్యక్రమాన్ని ఉద్యమ స్పృహతో సాంగించిన గొప్ప నాయకుడైన కెసిఆర్ పుట్టినరోజు అందరికీ పండుగనేనని జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. దేనినైనా ఉన్నతస్థాయిలో ఆలోచించడమే గాకుండా త్రికరణశుద్ధితో ఆచరించే మహానేత కేసీఆర్ అని ఆయన తెలి పారు. కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ చేపట్టిన వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని ఎంపి సంతోష్ కోరారు.