Friday, January 24, 2025

హైకోర్టులో కెసిఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందన్న అంశంపై భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులను కొట్టివేయాలని కోరారు. మేడిగడ్డ నిర్మాణంలో ప్రమాణాలు పాటించలేదని, దీనివల్ల ప్రజాధనం వృథా అయ్యిందని రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి జిల్లా కోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై విచారణ చేపట్టిన జిల్లా న్యాయస్థానం జులై 10న కెసిఆర్, హరీశ్‌రావు సహా ఆరుగురికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో కెసిఆర్, హరీశ్‌రావు తాజాగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News