Thursday, December 19, 2024

నేను భారతీయులకే గులామ్‌ను..

- Advertisement -
- Advertisement -

ఇటలీ, నకిలీ గాంధీ కుటుంబానికి
కాదు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
ఘాటు వ్యాఖ్యలు

మన తెలంగాణ/హైదరాబాద్‌ః గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజకీయాల్లో నైతిక విలువలు వదిలేశారని, రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నైతిక విలువలకు తిలోదకాలిచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా బిఆర్‌ఎస్ బాటలోనే నడుస్తోందని విమర్శించారు. కెసిఆర్ హయాంలో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారన్న కిషన్‌రెడ్డి ఏకంగా ఇప్పుడు అప్పుల కోసం టాస్క్‌ఫోర్స్‌నే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలపై బొంగులూర్ గేట్ ఉన్న వేద కన్వెన్షన్‌లో సోమవారం వర్క్ షాప్‌ను బీజేపీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉండి భ్రష్టు పట్టించిందని విమరిశంచారు. తాను గుజరాతీలకు గులామ్‌నంటూ సిఎం రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలకు వర్క్‌షాప్ వేదికగా కిషన్‌రెడ్డి గట్టిగా బదులిచ్చారు. తాను భారతీయులకు మాత్రమే గులామ్‌నని సర్దార్ వల్లభాయ్ పటేల్ , మహాత్మా గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన గుజరాత్‌కు తాను గులామ్‌నేనని అన్నారు. ఇటలీకీ, నకిలీ గాంధీ కుటుంబానికి తాను గులామ్ కాదని స్పష్టం చేశారు.

35 లక్షల సభ్యత్వం నమోదు

రాష్ట్రంలో 35 లక్షల బిజెపి సభ్యత్వం నమోదు పూర్తి అయిందని కిషన్‌రెడ్డి అన్నారు. ఈ నెల చివరి వరకు పోలింగ్ బూత్ కమిటీలు పూర్తి చేయాలన్నారు. సామరస్యంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పోలింగ్ బూత్ కమిటీలు వేయాలని అన్నారు. ఈ నెల 22 న ఢిల్లీలో జరిగే సమావేశంలో మండల, జిల్లా ఎన్నికల తేదీలు ఖరారు అవుతాయని తెలిపారు. వచ్చే నాలుగేళ్లు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో ఉంటూ పోరాడాలన్నారు. రెండు పార్టీలు దిగజారుడు రాజకీయాల చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి యే మొఖం పెట్టుకుని వెళ్తున్నారు, సిగ్గుండాలి అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మహారాష్ట్రలో తెలంగాణ కాంగ్రెస్ ఇస్తున్న ప్రకటనలను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాలని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు రైతుల రుణమాఫీ చేయలేదన్నారు. వంద రోజుల్లో అమలు చేస్తానన్న హామీలు 340 రోజులు అవుతున్న చేయలేదన్నారు. ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు తెలంగాణ ఆర్థిక పరిస్థితి తెలియదా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. పెన్షన్ ఒక రూపాయి పెంచలేదు, ఒక్కరికి కొత్తగా పెన్షన్ ఇవ్వలేదన్నారు.
తెలంగాణ సమాజాన్ని తాకట్టు పెట్టి అప్పుడు బీఆర్‌ఎస్ అప్పు చేసిందని, నేనేమన్నా తక్కువ తిన్నానా అని అప్పుల కోసమే ఒక టాస్క్ ఫోర్స్‌ని రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని విమర్శించారు. కమిషన్‌ల కోసం గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా చేస్తోందని అన్నారు. బిజెపి మండల కమిటీల్లో 30 నుంచి 35 శాతం కొత్త రక్తం ఉండాలని సూచించారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యమాలు చేపట్టి కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

అధికారంలో ఉన్న పార్టీతో సంబంధాలు పెట్టుకొని ఎంఐఎం పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రాహుల్ గాంధీ సంకల్లో చేరిపోయి రాహుల్ నేతృత్వంలో పని చేస్తున్నారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామ చంద్ర రెడ్డి మాట్లాడుతూ కిషన్ రెడ్డి ఫిరాయింపులు చేసి, రాజకీయ పబ్బం గడుపుకోవడం లేదని అన్నారు. కిషన్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు లేదని తేల్చి చెప్పారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, రైల్వే స్టేషన్లు, నాలుగు వందే భారత్ రైళ్లు రాష్ట్రానికి తీసుకు రావడం గులాం చేసినట్టా..? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి పది లక్షల కోట్ల నిధులను తీసుకు రావడం గులాం చేసినట్టా..? అని నిలదీశారు. కాంగ్రెస్ మంత్రులు కనీస ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ వర్క్‌షాప్‌లో కిషన్ రెడ్డితో పాటు ఎంపీలు డికె అరుణ, ఈటెల రాజేందర్, బిజెపి ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News