Monday, December 23, 2024

కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై కెసిఆర్ ఆగ్రహం….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రైతులను కాపాడుకునేందుకు బిజెపిపై తీవ్ర స్థాయిలో పోరాటం చేయాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ భ‌వ‌న్‌లో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ స‌మావేశంలో ఆయన ప్రసంగించారు.  వ్యవసాయ ఉత్పత్తులకు రాజ్యాంగ రక్షణ అవసరం ఉందన్నారు. తెలంగాణ ఉద్యం కంటే తీవ్రంగా ఆందోళన చేపడదామన్నారు. మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు.

తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. విభజన చట్టం హామీలను మోడీ ప్రభుత్వం అమలు చేయడం లేదని విరుచుకపడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా 24, 25 తేదీల్లో ఆందోళనలు చేస్తామన్నారు. రైతు వేసే ప్రతి పంటకు కేంద్రం గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.

కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో సమస్యలు పక్కదారి పట్టించడానికే సినిమా విడుదల చేశామరి ఆగ్రహం వ్యక్తం చేశారు. 28న యాదాద్రికి అందరూ రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో రైతులందరినీ కలుపుకొని ఉద్యమించాలన్నారు. కేవలం టిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలే కాదని, అంతా కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News