Sunday, January 19, 2025

కంటోన్మెంట్ అభ్యర్థిని ప్రకటించిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్ కంటోన్ మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు బిఆర్ఎస్ అభ్యర్థిని ఆ పార్టీ అధినేత కెసిఆర్ ప్రకటించారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు, లాస్య నందిత సోదరి నివేదత పేరును అధికారికంగా కెసిఆర్ వెల్లడించారు. గత ఫిబ్రవరి నెలలో పటాన్ చెరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్ మెంట్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో కంటోన్ మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఇప్పటికే, కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి కంటోన్ మెంట్ లో నారాయణన్ శ్రీ గణేష్ పోటీ చేయనున్నట్లు వెల్లడించింది. ఇక, బిజెపి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. శ్రీ గణేష్.. ఇటీవల బిజెపి నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News