Tuesday, December 24, 2024

బిఎస్పితో బిఆర్ఎస్ పొత్తు: కెసిఆర్ మాస్టర్ ప్లాన్!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న క్రమంలో బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడంతో.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఎంపి స్థానాలు గెలిచి సత్తా చాటాలని కెసిఆర్ పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బిఎస్పి పార్టీతో కెసిఆర్ పొత్తు పెట్టుకున్నారు. ఈ పొత్తుపై చర్చించేందుకు బంజారాహిల్స్‌లోని నందిన‌గ‌ర్ లో తన నివాసంలో బిఎస్పి చీప్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమాతో సమావేశమయ్యారు కెసిఆర్.

ఈ సందర్భంగా పొత్తుతోపాటు పలు విషయాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నట్లు ఆర్ఎస్పి, కెసిఆర్ చెప్పారు. ఎన్నికల్లో బిఎస్పితో పొత్తు ఉంటుందని కెసిఆర్ స్పష్టం చేశారు. త్వరలో పొత్తుపై విధివిధానాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. కాగా, పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి ఆర్ఎస్పి పోటీ చేయనున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News