Monday, January 20, 2025

హైదరాబాద్ ఎంపి అభ్యర్థిని ప్రకటించిన బిఆర్ఎస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే బిఆర్ఎస్ అభ్యర్థిని పార్టీ అధినేత కెసిఆర్ ప్రకటించారు. గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను హైదరాబాద్ నుంచి ఎన్నికల బరిలో దింపుతున్నట్లు కెసిఆర్ వెల్లడించారు. తాజా ఎంపి అభ్యర్థి ప్రకటనతో 17 లోక్ సభ స్థానాలకు బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థులు ఖరారు అయ్యారు. కెసిఆర్.. ఇప్పటికే 16 ఎంపి అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

సికింద్రాబాద్‌ నుంచి పద్మారావు గౌడ్‌, కరీంనగర్‌ నుంచి వినోద్‌కుమార్‌, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్‌, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్‌ నుంచి మాలోత్‌ కవిత, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్‌ నుంచి డాక్టర్ కడియం కావ్య, జహీరాబాద్‌ నుంచి అనిల్‌ కుమార్‌, నిజామాబాద్‌ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్‌, నాగర్‌కర్నూల్‌ నుంచి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, మెదక్‌ నుంచి వెంకట్రామిరెడ్డి, మహబూబ్‌నగర్‌ నుంచి మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, మల్కాజిగిరి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్‌ నుంచి ఆత్రం సక్కు, భువనగిరి నుంచి క్యామ మల్లేశ్‌, నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి , హైదరాబాద్‌ నుంచి గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ లు లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ ఎస్ తరుపున పోటీ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News