Monday, December 23, 2024

సికింద్రాబాద్ బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థిగా పద్మారావు గౌడ్

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే తిగుళ్ల పద్మారావు గౌడ్ ను బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ప్రకటించారు. పార్టీ శాసన సభ్యులు ప్రజాప్రతినిధులు ఇతర ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయం సేకరించిన అనంతరం కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

పార్టీ సీనియర్ నేతగా, ఉద్యమ కాలం నుంచి పార్టీకి విధేయుడుగా ఉంటూ అందరివాడిగా పద్మారావు గౌడ్ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, బిజెపి పార్టీలను ఎదుర్కొనేందుకు సరైన నాయకుడి కోసం అన్వేషించిన కెసిఆర్.. అందరి ఏకాభిప్రాయం మేరకు సికింద్రాబాద్ నుంచి పద్మారావు గౌడ్ ను లోక్ సభ ఎన్నికల బరిలోకి దింపేందుకు నిర్ణయించుకున్నారు. కాగా, బిజెపి నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ పోటీ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News