Saturday, December 21, 2024

భద్రాచలం ముంపు బాధితులకు శాశ్వత కాలనీలు : సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR Announces Rs.1000 Cr To New Colony Construction

 

 

హైదరాబాద్: వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా భద్రాచలంలో గోదావరి నదిపై సిఎం కెసిఆర్ గంగమ్మ తల్లికి పూజలు చేసిన అనంతరం కరకట్టను పరిశీలించారు. భద్రాచలం జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ ముంపు బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న నిత్యావసర వస్తువుల, సౌకర్యాలు, వైద్యం, ఇతర సహాయం గురించి సిఎం ఆరా తీశారు. వారిని పేరుపేరునా పలకరించారు. తమకు అన్నిరకాలుగా సహాయ, సహకారాలు అందుతున్నాయని, స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ అధికారులు తమను కంటికి రెప్పలా కాపాడుతున్నారని బాధితులు వివరించారు. భారీ వర్షాలను, వరదలను లెక్కచేయకుండా తమను పరామర్శించడానికి వచ్చిన సిఎం కెసిఆర్ ను చూసి భద్రాచలం వాసులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. భద్రాచలంలో వరదలు వచ్చినపుడల్లా ప్రతిసారి ఇక్కడి ప్రజలు ముంపునకు గురికావడం బాధాకరమని కెసిఆర్ అన్నారు.

శాశ్వత ప్రాతిపదికన కాలనీల నిర్మాణం :

తరచుగా వరదల్లో మునిగిపోతున్న భద్రాచలం వాసుల కన్నీళ్లను తుడిచేందుకు కెసిఆర్ వారికి శాశ్వత ప్రాతిపదికన నివాసాల కోసం కాలనీలు నిర్మించాలని నిర్ణయించారు. వరద చేరని ఎత్తైన ప్రదేశాల్లో అనువైన స్థలాలను గుర్తించి, బాధితులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి, నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ ను ఆయన ఆదేశించారు. తమకు శాశ్వత ప్రాతిపదికన రిలీఫ్ దొరకుతుండటంతో పునరావాస కేంద్రాల్లోని బాధితులు హర్షం వ్యక్తం చేశారు. బాధితులకు శాశ్వత ప్రాతిపదికన నివాస కాలనీల నిర్మాణాలతో సహా, భద్రాచలం సీతారాముల దేవస్థానం చుట్టూ కరకట్ట అభివృద్ధికి, బూర్గంపాడు వైపు ఉన్న కరకట్ట మరమ్మతులకు కలిపి మొత్తంగా భద్రాచలం ప్రాంతంలోని గోదావరి ముంపు సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం కోసం చేపట్టే అన్నిరకాల పనులకు రూ.1,000 కోట్లు కేటాయిస్తున్నట్లు సిఎం కెసిఆర్ మీడియా సమావేశంలో ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News