Wednesday, January 22, 2025

ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు కెసిఆర్

- Advertisement -
- Advertisement -

KCR attended at Mulayam Singh Yadav's last rites

హైదరాబాద్: సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి, ఎంపి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరుకానున్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఇటావా జిల్లాలోని ములాయం స్వగ్రామం సైఫయ్ కు మంగళవారం మధ్యాహ్నం సిఎం చేరుకోనున్నారు. దివంగత ములాయం సింగ్ యాదవ్ పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళుర్పించనున్నారు. అనంతరం అంత్యక్రియల్లో సిఎం కెసిఆర్ పాల్గొననున్నారు.  ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ సంతాపం తెలిపారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన ములాయం యుపి, దేశ రాజకీయాలలో తనదైన ముద్ర వేశారన్నారు. ములాయంసింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ కు వారి కుటుంబ సభ్యులకు హోం మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News