Thursday, January 23, 2025

ఎదగాలి ఇంతకు ఇంతై..

- Advertisement -
- Advertisement -

12వ క్లాస్ గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్న సిఎం మనుమడు, మంత్రి కెటిఆర్ తనయుడు హిమాన్షు
ఆశీర్వదించిన ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు
హిమాన్షుకు సిఎఎస్ విభాగంలో ఎక్స్‌లెన్స్ అవార్డు
హైదరాబాద్ : ఉన్నత చదువులు చదివి జీవితంలో మరింతగా ఎదగాలని, సమాజానికి గొప్పగా సేవ చేయాలని, 12వ క్లాస్ గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్న తమ మనుమడు హిమాన్షు రావును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు ఆశీర్వదించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మనుమడు, మంత్రి కెటిఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు గచ్చిబౌలీలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి తన 12వ క్లాస్‌ను పూర్తి చేసి గ్రాడ్యేయేషన్ పట్టాను అందుకున్నారు. ఈ సందర్భంగా తాను చదువుతున్న స్కూల్‌లో ‘12వ క్లాస్ గ్రాడ్యుయేషన్ డే’ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హిమాన్షు తాతగారు నాయనమ్మలైన సిఎం కెసిఆర్,శోభమ్మ దంపతులు, తల్లిదండ్రులు కెటిఆర్ శైలిమలు, చెల్లెలు అలేఖ్య తదితర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

హిమాన్షుకు సామాజిక సేవలో ఎక్స్‌లెన్సీ అవార్డు
గ్యాడ్యుయేషన్ డే సందర్భంగా 12వ తరగతిని విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు ఓక్రిడ్జ్ స్కూలు యాజమాన్యం గ్రాడ్యుయేషన్ పట్టాలను అందజేసింది. అదే సందర్భంలో…విద్యనభ్యసిస్తూనే క్రీడలు, సాంస్కృతిక రంగం, సామాజిక సేవ తదితర రంగాల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థినీ విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం ప్రతిభా పురస్కారాలను అందజేసింది. ఇందులో భాగంగా, సిఎం కెసిఆర్ మనుమడు కల్వకుంట్ల హిమాన్షు రావు ‘కమ్యూనిటి యాక్టివిటీ సర్వీసెస్’ (సిఎఎస్) విభాగంలో గొప్ప ప్రతిభను ప్రదర్శించినందుకు గాను ఆయన ప్రతిభను గుర్తించి, హిమాన్షును సిఎఎస్ విభాగంలో ఎక్స్‌లెన్స్ అవార్డును అందజేశారు.

Also Read: ‘సింహం బోనులోకి కోతి మాత్రమే వెళ్తుంది’… ‘ఏజెంట్’ ట్రైలర్

గ్యాడ్యుయేషన్ పట్టాను అందుకున్న హిమాన్షు వెంటనే స్టేజీ దిగివచ్చి తమ తాత గారైన సిఎం కెసిఆర్ చేతుల్లో గ్రాడ్యుయేషన్ పట్టాను పెట్టి పాదాలకు నమస్కరించి తాతగారి దీవెనలను తీసుకున్నారు. చిన్నతనం నుంచీ తనచేతుల్లో పెరిగి నేడు పట్టబధ్రుడుగా ఎదిగిన మనువడిని సిఎం కెసిఆర్ హృదయపూర్వకంగా అభినందించారు. హిమాన్షు తాను చదువుకున్న పాఠశాల యాజమాన్యం శిక్షణలో భాగంగా అప్పగించిన సామాజిక సేవ అంశాన్ని సవాలుగా తీసుకుని, ఆ విభాగానికి అధ్యక్షత వహిస్తూ సామాజిక సేవలో గొప్పగా ప్రతిభ కనబరిచి అందులో ఎక్స్‌లెన్సీ అవార్డును పొందారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ తన మనుమడు హిమాన్షును అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనుమడిని సిఎం ఆశీర్వదించారు.

కెటిఆర్ దంపతుల పుత్రోత్సాహం
గ్రాడ్యుయేషన్ పట్టాలనందుకుంటున్న సహచర విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన హిమాన్షు తల్లిదండ్రులు మంత్రి కెటిఆర్, శైలిమ దంపతులు తమ కుమారుడు పెరిగి పెద్దవాడై సాధించిన ప్రతిభానైపుణ్యాల చూసి పుత్రోత్సాహంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హిమాన్షు అమ్మమ్మ, మేనమామలు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. హిమాన్షు రావుతో పాటు గ్రాడ్యుయేషన్ పట్టాను పొందిన క్లాస్‌మేట్ ఆద్విత్ బిగాల తండ్రి, బిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సెల్ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల, ఆయన పెదనాన్న ఎంఎల్‌ఎ గణేష్ బిగాల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రాడ్యుయేషన్ డే సంద్భంగా పట్టాలు అందుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో సమావేశ మందిరం కిక్కిరిసింది. విద్యార్థుల హర్షధ్వానాలతో ప్రాంగణం మారు మోగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News