Saturday, February 22, 2025

మేం బిక్ష వేస్తే.. కెసిఆర్ ఎంపి అయ్యారు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

నారాయణ్‌పేట: దేశంలో ఎక్కడ ఏ ప్రాజెక్టు కట్టినా.. మట్టి తీసేది మా పాలమూరు బిడ్డలే అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. నారాయణ్‌పేట్ జిల్లా అప్పకపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన బిఆర్ఎస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. ‘2009లో మేం బిక్ష వేస్తే.. కెసిఆర్ ఎంపి అయ్యారు’ అని రేవంత్ పేర్కొన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కెసిఆర్ ప్రజల సొమ్మును దోచుకున్నారని ఆయన మండిపడ్డారు. పదేండ్ల కెసిఆర్, 11 ఏళ్ల మోడీ పాలనపై చర్చకు తాను వస్తానని.. కెసిఆర్, కిషన్ రెడ్డిలు వస్తారా అని సవాలు విసిరారు.

తనపై పగతో పాలుమూరుపై కెసిఆర్ కక్షగట్టారు అని అన్న రేవంత్ పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే చంద్రబాబుతో పంచాయతీ ఉండేది కాదు అని పేర్కొన్నారు. జగన్‌ను పిలిపించి రాయలసీయ ఎత్తిపోతలకు పథకం రచించింది కెసిఆర్ కాదా అని ప్రశ్నించారు. దీంతో పాలమూరుకు పారాల్సిన నీళ్లను రాయలసీయకు తరలించారు అని మండిపడ్డారు. లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టిన కెసిఆర్ వేల కోట్లు దోచుకున్నారని అన్నారు. నీళ్లు రాయలసీమ తరలించుకుపోతే.. నిధులు కెసిఆర్ దోచుకున్నారని రేవంత్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News