Thursday, February 20, 2025

లండన్‌లో వృక్షార్చనతో కెసిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినం శుభసందర్భాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన వృక్షార్చనలో ఎఫ్దీసి మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం కుటుంబసమేతంగా ఆదివారం పాల్గొని లండన్‌లో మొక్కలు నాటారు. కెసిఆర్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి భగవంతుని ఆశీస్సులతో వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టు అనిల్ కూర్మాచలం తెలిపారు. అందరూ వృక్షార్చనలో పాల్గొని ‘ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి‘ విజయవంతం చేయాలని కోరారు. పచ్చదనం కోసం మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ చేస్తున్న కృషి చాలా గొప్పదని, ఇందులో అందరూ భాగస్వాములు కావాలని అనిల్ పిలుపునిచ్చారు. రాబోయే తరాలు సంతోష్‌ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాయని, ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్‘ ఒక చారిత్రాత్మక కార్యక్రమంగా చరిత్రలో నిలిచిపోతుందని అనిల్ కూర్మాచలం పేర్కొన్నారు.

ఆస్ట్రేలియాలోని బ్రిస్‌బెన్ నగరంలో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బిఆర్‌ఎస్ క్వీన్స్ ల్యాండ్ కన్వీనర్ విన్నీ తుమకుంట అధ్వర్యంలో సభ్యులందరు ప్రత్యేక పూజలు,అన్నదాన కార్యక్రమాలు చేసి, వృక్షార్చనతో అభిమానుల మధ్య కెసిఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విన్నీ తూముకుంట మాట్లాడుతూ, అరవై ఏళ్ల స్వరాష్ట్ర కలను సాకారం చేసి, తొమ్మిదిన్నర యేండ్ల పాలనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపాలని అన్నారు. అభివృద్ధి, సంక్షేమాలకు చిరునామాగా తెలంగాణను నిలిచిన కెసిఆర్ ధీర్ఘాయుష్యుతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి అవ్వాలని ఆకాంక్షించారు. వృక్షార్చన కార్యక్రమంలో తరుణ్ కొండం,రవి బతుక, శ్రీవేకర్ రెడ్డి పుల్యాల,రాజేష్ గుట్ట,రాకేష్ కాస, సంతోష్ రెడ్డి, మధు, శ్రీనివాస్ ఏలిజాల,యుగేందర్ రెడ్డి, రవి యాదవ్‌లు పాల్గొని మొక్కలు నాటారు.

ఆక్లాండ్‌లో…

న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో భారీ కేక్‌ను కట్ చేశారు. తెలంగాణ అభివృద్ధిలో కెసిఆర చేసిన విశేష సేవలను స్మరించుకుంటూ ప్రసంగాలు చేశారు. కెసిఆర్ దార్శనికత, నాయకత్వం, తెలంగాణ రూపకల్పనపై జరిగిన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలు న్యూజిలాండ్‌లోని తెలుగువారిలో సమైక్యత, తెలంగాణ పట్ల ప్రేమను ప్రతిబింబించాయి. ఈ కార్యక్రమం న్యూజిలాండ్ బిఆర్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఉపాధ్యక్షులు రామా రావు, కిరణ్ పొకల, ప్రధాన కార్యదర్శి అరుణ్ ప్రకాశ్ న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు, బిఆర్‌ఎస్ న్యూజిలాండ్ సీనియర్ నాయకుడు కళ్యాణ్ రావు నాయకత్వంలో నిర్వహించారు. బిఆర్‌ఎస్ సభ్యులు ప్రకాశ్ బిరాదార్, సుధీర్ బాబు రాచపల్లి, డా. మోహన్ రెడ్డి, పీ.వి.ఎన్ రావు, మరియు శ్రీనివాస్ పుడారి వంటి నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News