Thursday, January 23, 2025

తెలంగాణ భవన్‌లో ఘనంగా కెసిఆర్ పుట్టిన రోజు వేడుకలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కె. కేశవ రావు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా కెసిఆర్ పై రూపొందించిన డాక్యూమెంటరీని పార్టీ నాయకులతో, కార్యకర్తలతో కలిసి వీక్షించారు. కెసిఆర్ జన్మదిన వేడుకలలో మాజీ మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, కార్పొరేటర్లు, మాజీ ఎంఎల్‌ఎలు, మాజీ ఎంఎల్‌సిలు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజవర్గ ఇన్‌ఛార్జీలు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News