Friday, February 21, 2025

ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూరు: మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో సోమవారం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలను బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు నేవూరి ధర్మేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కెటిఆర్ పిలుపు మేరకు మొక్కలు నాటారు. అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం బైక్ ర్యాలీతో స్థానిక శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయానికి చేరుకుని 500 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు పొన్నెబోయిన రమేష్, జంగ శ్రీను, మార్కెట్ మాజీ చైర్మన్లు కొణతం యాకూబ్ రెడ్డి, తీపిరెడ్డి మేఘారెడ్డి, చిప్పలపల్లి మహేందర్ నాథ్, మదర్ డెయిరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి, బిఆర్‌ఎస్ మండల,

పట్టణ ప్రధానకార్యదర్శులు గిరగాని శ్రీనివాస్, గజ్జి మల్లేష్, నాయకులు కొండా సోంమల్లు, చౌగోని సత్యంగౌడ్, పానుగుళ్ల విష్ణుమూర్తి, మర్రి అనిల్ కుమార్, బయ్యని పిచ్చయ్య, బత్తిని తిరుమలేష్, దండెబోయిన మల్లేష్, కడమంచి వస్తాద్, అండెం రాజిరెడ్డి, దబ్బెటి శైలజ, బుశిపాక లక్ష్మీ, జానమ్మ, కట్ట ఇంద్రజ్యోతి, దాసరి తిరుమలేష్, గనగాని రాజేష్, పొన్నాల వెంకటేశ్వర్లు, సామ పద్మారెడ్డి, పురుగుల మల్లయ్య, విద్యాసాగర్, పరమేష్, మత్సగిరి, శ్రీరాముల అయోధ్య, పూలపెల్లి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News