కువైట్: తెలంగాణ జాతిపిత, ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలను టిఆర్ఎస్ ఎన్అర్ఐ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కెటిఆర్ పిలుపు మేరకు టిఆర్ఎస్ ఎన్అర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల సూచనలతో టిఆర్ఎస్ కువైట్ సభ్యులందరము దుస్తువులు దానం చేయడం, మొక్కలు నాటడంతోపాటు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకోవడం జరిగింది. ఈ మధ్యలోనే అమలు చేసినటువంటి మన ఊరు మన బడి కార్యక్రమాన్ని కూడా మన వంతుగా పాలుపంచుకొని విజయవంతం చేయాలనీ అభిలాష కోరుకున్నారు.
తెలంగాణ ప్రధాత కెసిఆర్ తెలంగాణ సాధించి ఎంతో అభివృద్ధి చేయడంతోపాటు ఎన్నో అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టారు. మన పథకాలు మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకి కూడా ఆదర్శంగా నిలుస్తూ వాళ్ళ రాష్ట్రాలలో కూడా అమలు పరుస్తున్నారని ప్రశంసించారు. తెలంగాణ అభివృద్ధి చెందిన విధంగా ఇండియా కూడా డెవలప్ అవ్వాలి అంటే అది కేవలం కెసిఆర్ వల్లనే అవుతుందని, రాబోయే రోజుల్లో కెసిఆర్ ను ప్రధాన మంత్రిగా చూడాలని టిఆర్ఎస్ కువైట్ టీమ్ తరుపున కోరుకుంటున్నామని మహేష్ బిగాల తెలిపారు.
కెసిఆర్ నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో ఉంటూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలన్నారు. కెసిఆర్ పుట్టిన రోజు కార్యక్రమంలో టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ కువైట్ ప్రెసిడెంట్ అభిలాష గొడిశాల, ముఖ్య సలహాదారులు గంగాధర్ జికె, వైస్ ప్రెసిడెంట్ రవి గన్నరపు, ప్రధాన కార్యదర్శి సురేష్ గౌడ్, కమిటీ సభ్యులు అయ్యప్ప, రవి సుధగాని, జగదీశ్ సాయి నాయుడు, మహమ్మద్ దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.