Monday, December 23, 2024

పూరీ జగన్నాథుడి చెంత కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు….

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: సిఎం కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా పూరీ జగన్నాథుడి చెంత, పద్మ శ్రీ  సుదర్శన్ పట్నాయక్ ‘సైకత’ శిల్పి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేటకు చెందిన వంగ రాజేశ్వర్ రెడ్డి సమన్వయంతో కెసిఆర్ సైకత శిల్పాన్ని పద్మ శ్రీ సుదర్శన్ పట్నాయక్ రూపొందించారు.   పోరాట యోధుడు, పరిపాలకుడు, దూరదృష్టి గల నేత సిఎం కెసిఆర్ కు హ్యాపీ బర్త్ డే కెసిఆర్ సర్ అని రాసి శుభాకాంక్షలు తెలిపారు.

ఇప్పటివరకు ముఖ్యమంత్రులలో ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ సైకత శిల్పాన్ని మాత్రమే రూపొందించారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా సరి కొత్తగా శుభాకాంక్షలు తెలిపారు.  ఒడిశాలో కొలువైన పూరీ జగన్నాథుడి చెంత, పూరీ బీచ్ వ‌ద్ద‌ సిఎం కెసిఆర్ భారీ సైకత శిల్పాన్ని పద్మ శ్రీ, ప్రముఖ సైకత శిల్పి సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్ రూపొందించారు. ఎంతో ఆకర్షణీయంగా రూపొందించిన సిఎం కెసిఆర్ సైకత చిత్రాన్ని పూరీ బీచ్ వద్ద ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సైతం ఆసక్తిగా తిలకించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News