సిద్దిపేట: సిఎం కెసిఆర్ కారణజన్ముడిగా.. చిరస్మరణీయుడుగా.. ప్రజల తల రాతలు మార్చే మహానియుడుగా..మహా నాయకునిగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలో కెసిఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు గారు మాట్లాడారు.
కెసిఆర్ ఈ మట్టి బిడ్డా కావడం గర్వకారణమని, తెలంగాణ రాష్ట్రం సాధించిన కారణ జన్ముడు కెసిఆర్ అని, తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ సాధించారని ప్రశంసించారు. రైతు బంధు, బీమా పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవంతో బ్రతికేలా కెసిఆర్ కృషి చేస్తున్నారని ప్రశంసించారు. రూ 65వేల కోట్లు రైతు బందు కోసం బడ్జెట్ లో పెట్టారని హరీష్ రావు కొనియాడారు. అభివృద్ధిలో సంక్షేమ లో తెలంగాణను కెసిఆర్ ముందుచారని, కెసిఆర్ ఎంత ఎదిగితే తెలంగాణకు అంత లాభమన్నారు. రాష్ట్ర ప్రజల పక్షాన కెసిఆర్ కు హరీష్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు,