Sunday, December 22, 2024

దివ్యాంగుల జీవితాల్లో సంతోషం నింపిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగులకు మరో వెయ్యి రూపాయలు పెంచి వారి జీవితాల్లో సంతోషం నింపారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. దివ్యాంగులకు వెయ్యి రూపాయలు పెంచడాన్ని హర్షిస్తూ ఆదివారం నకిరేకల్‌స్థానిక క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య దివ్యాంగులతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.

తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాతనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందిందని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌ను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీటీసీలు మాద ధనలక్ష్మి, తరాల బలరాం, ఎంపీపీలు సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, జెల్లా ముత్తిలింగం, ఏఎంసీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు ప్రగడపు నవీన్‌రావు, యల్లపురెడ్డి సైదిరెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News