Friday, January 3, 2025

వికలాంగుల జీవితాల్లో వెలుగులు ప్రసాదించిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

కృతజ్ఞతలు తెలిపిన కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవ్ రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్ : బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన మ్యానిఫెస్ట్‌లో వికలాంగుల పెన్షన్ మరో రెండు వేలు పెంచుతూ ప్రకటించడం పట్ల వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా. వాసుదేవ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం చైర్మన్ డా.వాసుదేవ్ రెడ్డి ఆధ్వర్యంలో కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు, టపాకాయలు పేలుస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవీయ కోణంలో మానవత్వంతో ఆలోచించే గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అని, ఇలాంటి నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో ఉండడం వికలాంగులు చేసుకున్న అదృష్టమని కొనియాడారు. మాకు కనపడే దేవుడు కెసిఆర్ అని వికలాంగుల సమాజం భావిస్తుందని ఆయనన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5.35 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రుణపడి ఉంటామన్నారు. నవంబర్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలో వికలాంగులంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చాటుకుంటామని  వాసుదేవ్ రెడ్డి అన్నారు. దేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ అందిస్తున్న రాష్ట్రం కాని,  ముఖ్యమంత్రి కాని ఎవరూ లేరని తెలిపారు. ఈ నెల 19న తెలంగాణ భవన్ లో కృతజ్ఞతా సభ ఏర్పాటు చేస్తున్నామని ఈ సభ ద్వారా వికలాంగులంతా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలువుతారన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News