Wednesday, January 22, 2025

విద్యుత్‌లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి జీవనాడి వంటి విద్యుత్తు రంగం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి చేపట్టిన చర్యల వలన, 60 ఏళ్ల సమైక్య పాలనలో సాధ్యం కానీ విద్యుత్ కేంద్రాలు, సబ్ స్టేషన్లు, లైన్లు నేడు తెలంగాణలో కేవలం ఆరు నెలలోనే సాధ్యమైందని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్దానిక టిఎన్జీవోస్ ఫంక్షను హాలులో విద్యుత్తు విజయోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేయర్ తోపాటు మున్సిపాలిటీ కమిషనర్ ఆదర్శ సురభి సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, విద్యుత్ శాఖ ఎస్.ఇ ఏ.సురేందర్, ట్రాన్స్ కో ఎస్‌ఇ శ్రీనివాస్, ఏడి సుధాకర్, డిఇ రామారావు తదితరు లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర తలసారీ విద్యుత్ వినియోగం 2140 యూనిట్లకు చేరిందని. ఇది జాతీయ సగటు (1255 యూనిట్లు) కంటే 70 శాతం అధికం అని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక గృహ వాణిజ్య పరిశ్రమలు సహా అన్ని రంగాలకు నిరంతర 24 గంటల విద్యుత్ సరఫరా, దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వని విధంగా వ్యవసాయరంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తూ నిరంతర విద్యుత్ సరఫరాతో భారత దేశ ధాన్యాగారంగా తెలంగాణ మారిందన్నారు.

కోతలు లేని నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పరిశ్రమలకు గమ్యస్థానంగా మారి ఉద్యోగవకాశాలు పెరిగాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అతికొద్ది కాలంలోనే డిమాండ్ లోటు అధిగమించి కేవలం పట్టణాలలో మాత్రమే కాదు, పల్లెల్లోని గృహ, వాణిజ్య, పరిశ్రమల రంగాలకు కూడా 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నారని ఆమె చెప్పారు. నగర మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురబి మాట్లడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం, మిగులు విద్యుత్ రాష్ట్రం దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేసిందన్నారు. సోలార్ పవర్ జనరేషన్‌లో దేశంలోని అగ్రగామి తెలంగాణ రాష్ట్రం ఉందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడ్డాక కొత్తగా రూ.8.46 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారన్నారు.

సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ మాట్లాడుతూ 27.49 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని కొనియాడారు. నాణ్యమైన విద్యుత్ సరఫరాతో తెలంగాణ వరదాయినిలుగా కాళేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి బహులార్ద ఎత్తిపోతల పథకాలను ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పారు విద్యుత్ శాఖ ఎస్‌ఇఏ సురేందర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తరువాత విద్యుత్ రంగంలో వచ్చిన మార్పులు, విద్యుత్‌ను ఎలా పొదుపుగా వాడుకోవాలో అలా వాడుకోవడం వలన పొందే ఉపయోగాలను గురించి వివరించారు. అలాగే ఈ కార్యక్రమం విశిష్టతను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన పురోగతిని సాధించిన విజయాలను వివరించారు.

రైతులకు 24 గంటలుపాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా, దళిత గిరిజనలకు ఉచితంగా వందలోపు యూనిట్లు, నాయీ బ్రాహ్మణలకు. దోబి సెలూన్లకి 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా, ట్రాన్స్‌ఫార్మర్ ఫెయిల్ అయితే 24 గంటల్లో అమర్చడం, పట్టణంలో, పల్లెలో లూజు లైన్లు దూరం లైన్లు సరి చేయుట. గ్రామీణ విద్యుదీకరణ కొత్త లైన్లు ఏర్పాటు పారిశ్రామిరణలో పురోగతి తదితర అంశాలపై స్లైడ్‌ల ద్వారా ప్రదర్శించారు. తెలంగాణ రాక ముందు ఉన్న దుర్భర పరిస్థితులు ఇప్పుడు అనుభవిస్తున్న సౌకర్యాలు వివరించారు.

అంతకుముందు ఇల్లందు క్రాస్ రోడ్ కరెంట్ ఆఫీస్ నుండి సమావేశ హాల్ వరకు కళాకారుల ధూంధాంతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, ఏడీఈలు, డిఈలు, ఏఈలు విద్యుత్ శాఖ సిబ్బంది, పలువురు కార్పొరేటర్లు పలువురు ఇంజినీర్లు అకౌంట్స్ అధికారులు, కార్మికులు, సంఘాల నాయకులు, విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News