Sunday, January 19, 2025

కెసిఆర్ 16 మెడికల్ కాలేజీలు కట్టిస్తే, మోడీ ఇచ్చింది జీరో!: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రాష్ట్రంలో 16 కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేయడం ద్వారా వైద్య విద్యను విస్తరించారని, మరో 13 ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి. రామారావు ఆదివారం తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కుమారుడైన రామారావు మాట్లాడుతూ 2014లో రాష్ట్రం ఏర్పడక ముందు ఈ ప్రాంతంలో కేవలం ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉండేవన్నారు.

‘‘గౌరవనీయులైన తెలంగాణ సిఎం కెసిఆర్ గారు వైద్య విద్యలో చరిత్ర సృష్టించారు. 2014కు ముందు, 67 ఏళ్లలో కేవలం 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే తెలంగాణలో ఏర్పాటు కాగా,  గత 8 సంవత్సరాలలో  16 కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు చేయబడ్డాయి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీగా మరో 13 సెటప్ చేయబోతున్నాము” అని ఆయన ట్వీట్ చేశారు. సంగారెడ్డి, మహబూబాబాద్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, రామగుండం, జగిత్యాలలో మెడికల్‌ కాలేజీలు కూడా దాదాపు పూర్తయ్యాయని, కొత్తగూడెంలో కాలేజీని త్వరలో ప్రారంభిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News