Tuesday, December 24, 2024

సర్కారు బడుల రూపురేఖలు మార్చిన కేసీఆర్

- Advertisement -
- Advertisement -

గచ్చిబౌలి: సర్కారు బడుల్లో మౌలిక వసతుల కల్పనకు మన ఊరు మన బడి కార్యక్రమాన్ని తీసుకొచ్చి వాటి రూపురేఖలే మార్చి ప్రయివేట్ పాఠశాలలకు ధీటుగా విద్యను అందించడం జరుగుతుందని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మేల్యే అరికెపుడి గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తెలంగాణ విద్యా దినోత్సవం కార్యక్రమానికి శేరిలింగంపల్లి సర్కిల్ డిప్యూటి కమిషనర్ వెంకన్న, ఎంఈఓ వెంకటయ్య, కార్పోరేటర్లు హమీద్ పటేల్, జగదీశ్వర్ గౌడ్, మాజీ కార్పోరేటర్ సాయిబాబా లతో కలిసి ఆయన మంగళవారం ముఖ్య అతిథిగా పాల్గోని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ లను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న మన ఊరు మన బడి మరియు మన బస్తి మన బడి కార్యక్రమంలో సర్కారు బడులు కొత్తరూపు సంతరించుకున్నాయని అన్నారు.

అదేవిధంగా మౌలిక వసతులు కల్పిస్తూ ప్రయివేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో అన్ని హంగులతో కూడి విద్యను అందించడమే కాకుండా నేడు అత్యధికంగా గురుకులాలు ఉన్న రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆయన పేర్కోన్నారు. అంతేకాకుండా 1,002 గురుకుల పాఠశాలలో 5,99,537 మంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతుందని, ప్రతి విద్యార్థిపై సంవత్సరానికి 1.25 లక్ష రూపాయులు తెలంగాణ ప్రభుత్వం వెచ్చిస్తుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకంతో పేద విద్యార్థుల విదేశీ కల సాకారం అయ్యిందని, విద్యతోనే వికాసం, విద్యతోనే ఆత్మవిశ్వాసం, ప్రతి తరగతి గది తరగని విజ్ఞానం, ఆ నాలుగు గోడలే దేశ భవిష్యత్తుకు మూల స్తంభాలు అనే సిద్ధాంతాన్ని నమ్మడమే కాక అక్షరాల ఆచరించిన తెలంగాణ ప్రభుత్వం తొమ్మిదేళ్ల ప్రగతి ప్రస్థానంలో సరికొత్త విద్యా విప్లవంతో యావత్ దేశానికే పాఠాలు నేర్పుతోందని ఎమ్మేల్యే గాంధీ పేర్కోన్నారు.

అదేవిధంగా ప్రయివేట్ పాఠశాలలను నుండి ప్రభుత్వ పాఠశాలల వైపు కొత్తగా లక్ష విద్యార్థులు అడుగులు వేయడం అంటే మన తెలంగాణ రాష్ట్రంలో విద్యా విధానం ఎలాంటి స్థాయిలో అభివృద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ఇది కేవలం మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యం అయ్యిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, బీఆర్‌ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు, ఏరియా కమిటి ప్రతినిధులు, ఉద్యమకారులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News