Sunday, January 19, 2025

13న చేవెళ్లలో కెసిఆర్ బహిరంగసభ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : అధికారం, ఆస్తుల కోసమే ఎంపి రంజిత్ రెడ్డి బిఆర్‌ఎస్‌ను విడిచి ద్రోహం చేశారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. కవితపైన కేంద్ర ప్రభుత్వ సంస్థలు సోదాల పేరుతో దాడి చేసి.. అరెస్టు చేసిన రోజే..కాంగ్రెస్‌లో చేరిన స్వార్థపరుడు రంజిత్ రె డ్డి అని పేర్కొన్నారు. గతంలో ఎన్నికలకు ముందు అప్పటి మాజీ ఎంపీ వి శ్వేశ్వర్ రెడ్డి కూడా ఇలానే పార్టీ మారి వెళ్లారన్నారు. పార్టీ కన్నా తానే ఎ క్కువ అనుకొని ఇతర పార్టీలోకి వెళితే ఫలితం ఏమైందో అందరికీ తెలుసన్నారు. ఒక పార్టీ కన్నా తానే పెద్ద అనే అహంకారం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో గెలవరని పేర్కొన్నారు. అదే నిజమైతే దేశంలో పార్టీలు ఉండవని, స్వతంత్ర అభ్యర్థులే గెలుస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రం జిత్ రెడ్డి కలిసినంత మాత్రాన కాంగ్రెస్,బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కలిసిపోతాయనుకోవడం వారి రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని కెటిఆర్ వ్యాఖ్యానించారు. చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, పార్లమెంట్ నియోజకవర్గం ఎంఎల్‌ఎలు, మాజీ ఎంఎల్‌ఎలతో బుధవారం తెలంగాణ భవన్‌లో సమావేశమైన కెటిఆర్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరిన రంజిత్ రెడ్డిపై కెటిఆర్ విమర్శలు గుప్పించారు.

రంజిత్ రెడ్డి ఎవరో మన పార్టీ సీటు ఇచ్చి, గెలిపించుకున్న తర్వాతనే ప్రపంచానికి తెలిసిందని అన్నారు. ఆయన 2019లో రాజకీయాలకు కొత్త అయినా పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి గెలిపించారని గుర్తు చేశారు. రాజకీయంగా పార్టీలో అత్యధిక ప్రాధాన్యత, నియోజకవర్గంలో స్వేచ్ఛ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయబోను, రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పి రంజిత్ రెడ్డి పార్టీకి ద్రోహం చేశారని మండిపడ్డారు. బిఆర్‌ఎస్ శ్రేణులే కాదు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ రంజిత్ రెడ్డికి పార్టీ ఏం తక్కువ చేసిందని, పార్టీకి మోసం చేసి వెళ్ళారని చర్చించుకుంటున్నారని అన్నారు. సొంతంగా అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో గెలవడం అసాధ్యమని కెటిఆర్ తెలిపారు. ఏప్రిల్ 13న చేవెళ్లలో జరిగే బహిరంగ సభలో కెసిఆర్ పాల్గొంటారని చెప్పారు. రంజిత్ రెడ్డి పార్టీ వీడినందుకు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పార్టీ అవకాశం ఇచ్చినందుకే ఆయన సేవ చేశారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. అందరూ కలసికట్టుగా కృషి చేసి చేవెళ్లలో హ్యాట్రిక్ విజయం సాధించాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News