Wednesday, January 22, 2025

సోయిలేని తనంతోనే మొదటి నుంచీ తెలంగాణ ఆగం:కెసిఆర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణకు న్యాయంగా దక్కవలసిన నదీ జలాల వాటాను సాధించుకోవడంలో ఉమ్మడి రాష్ట్రంలో నాటి ఆంధ్రా నాయకత్వ స్వార్థంతో పాటు తెలంగాణ నాయకత్వం అనుసరించిన నిర్లక్ష్య ధోరణి సోయిలేని తనం ప్రధాన కారణాలుగా మారి తెలంగాణ రైతాంగానికి దశాబ్దాల పాటు నష్టాన్ని కలిగించిందని బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ అన్నారు. విద్యుత్, వ్యవసాయ రంగంలో తెలంగాణకు ఉద్దేశపూరిత ద్రోహాలను పసిగట్టడంలో నాటి తెలంగాణ నాయకత్వ చైతన్య రాహిత్యం రైతాంగానికి తీరని శాపంగా మారిందని పేర్కొన్నారు. అటువంటి సంక్లిష్ట పరిస్థిలోంచి తెలంగాణ సమస్యలను అర్థం చేసుకొని కవులు కళాకారులు మేధావుల సాహిత్య సాంస్కృతిక ప్రక్రియ ఒకవైపు టిఆర్‌ఎస్ రాజకీయ ప్రక్రియ మరోవైపు జమిలిగా సాగి భావజాల వ్యాప్తి చేస్తూ ప్రజలకు అర్థం చేయించి ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ సాధించగలిగామని కెసిఆర్ వివరించారు.

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రజా వాగ్గేయకారుడు, ఎంఎల్‌సి గోరేటి వెంకన్న గురువారం నాడు ఎర్రవెల్లి నివాసంలో కెసిఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కవిత్వ పుస్తకాలను కెసిఆర్‌కు అందజేశారు. అనంతరం సాగిన ఇష్టాగోష్టి సమావేశంలో తెలంగాణ సాహిత్యం సంస్కృతి రాజకీయాలు తదితర అంశాలపై చర్చించారు. అదే సందర్భంలో సీనియర్ జర్నలిస్టు వర్దెల్లి వెంకన్న తన ‘పిట్ట వాలిన చెట్టు’ పుస్తకాన్ని కెసిఆర్‌కు అందించారు. ఈ సందర్భంగా పుస్తకాన్ని పరిశీలించిన కెసిఆర్ వర్దెల్లిని అభినందించారు. ఈ సమావేశంలో ఎంఎల్‌సి మధుసూదనాచారి, శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ జీవన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News