Friday, December 20, 2024

కెసిఆర్ సినిమా సూపర్ హిట్ కావాలి

- Advertisement -
- Advertisement -

కేశవ చంద్ర రామావత్ కెసిఆర్ సినిమా సూపర్ హిట్ కావాలి

కెసిఆర్ పేరుతో సినిమా
తీయడం గొప్ప విషయం
మాజీ మంత్రి హరీశ్‌రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : అన్ని రాష్ట్రాలకు సిఎం ఉంటే, తెలంగాణకు మాత్రం రాష్ట్రాన్ని తెచ్చిన సిఎం కెసిఆర్ అని మాజీ మంత్రి,బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు పేర్కొన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి పేరుతో, స్పూర్తితో వస్తున్న కేశవ చంద్ర రామావత్ కెసిఆర్ సినిమా సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు. సోమవారం జరిగిన కేశవ చంద్ర రామావత్ కెసిఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాకేష్‌తోపాటు కెసిఆర్ సినిమా నటీనటులు, ప్రముఖ గాయకులు గోరేటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, బిఆర్‌ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, కెసిఆర్ పేరుతో సినిమా తీయడం గొప్ప విషయమని వ్యాఖ్యానించారు.

రాకేష్. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారని, జబర్దస్త్‌లో రాణించి, రాకింగ్ రాకేష్ గా ఎదిగారని పేర్కొన్నారు. కెసిఆర్ అంటే ఒక చరిత్ర అని, కెసిఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించి, అద్భుతంగా అభివృద్ధి చేశారని తెలిపారు. పల్లెలనే కాదు, పట్టణాలను అభివృద్ధి చేశారని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని చూసి రజినీకాంత్ న్యూయార్క్‌లో ఉన్ననా, ఇండియాలో ఉన్ననా అన్నారని గుర్తు చేశారు.

కెసిఆర్ భౌతికంగా మాత్రమే కాదు, రాష్ట్రాన్ని సామాజికంగా, సాంస్కృతికంగా అభివృద్ధి చేశారని చెప్పారు. తెలంగాణను కెసిఆర్ దేశానికి దిక్సూచిగా చేశారని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు సినిమాలు తీస్తారని, అధికారంలో లేకున్నా కెసిఆర్ అని సినిమా తీశారని, దీనికి ఎంతో ధైర్యం, దమ్ము కావాలని వ్యాఖ్యానించారు. నిజమైన అభిమానానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. అందరూ కెసిఆర్ సినిమా చూసి, రాకేష్‌ను అభినందించాలని కోరారు. సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News