హైదరాబాద్: బిఆర్‌ఎస్ పాలనలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యారని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. ప్రగతి భవన్‌లోకి ఎవరినీ రానివ్వకుండా సెక్రటేరియట్ ఆయన వెళ్లకుండా బాధ్యతారహితంగా వ్యవహరించారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత పది సంవత్సరాల నుంచి రైతులను పట్టించుకోని కెసిఆర్.. ఇప్పుడు ప్రజాక్షేత్రంలోనికి వస్తున్నాడని అనడం ఏంటని మండిపడ్డారు. బిఆర్‌ఎస్ పాలనలో రైతుల తరపున పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సమీక్షలు జరుపుతున్నారని ప్రశంసించారు. ప్రతిపక్ష హోదాలో మాజీ సిఎం కెసిఆర్ సభకు రావాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించారని, కానీ ఒక్కసారి మాత్రమే వచ్చారని, ఆయనకు ప్రజలపై ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు ఇవ్వాలని పాలక పక్షం కోరినా కూడా పట్టించుకోలేదన్నారు. కెసిఆర్ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారని బిఆర్ఎస్ నేతలు స్టేట్‌మెంట్లు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని జగ్గారెడ్డి చురకలంటించారు.
కెసిఆర్ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రావడం హాస్యాస్పదం: జగ్గారెడ్డి
- Advertisement -
- Advertisement -
- Advertisement -