Thursday, January 23, 2025

కెసిఆర్ వ్యాఖ్యల్లో తప్పేంటి?

- Advertisement -
- Advertisement -

మేం నిజమైన అంబేద్కర్ వారసులం, బిజెపి వాళ్లు
గాడ్సే వారసులు అలాంటి వాళ్లతో నీతులు
నేర్చుకోవాల్సిన అవసరం లేదు నిజంగా
అంబేద్కర్‌పై ప్రేముంటే దళితబంధు అమలు
చేయండి బిజెపి, కాంగ్రెస్ కోతికి కొబ్బరిచిప్ప
దొరికినట్టు వ్యవహరిస్తున్నాయి : ఎంఎల్‌సి
కడియం, ఎంఎల్‌ఎలు బాల్క సుమన్, క్రాంతి ఫైర్

దేశ ప్రగతికోసమే రాజ్యాంగాన్ని మార్చాలన్నారు

KCR comments are Right by kadiyam srihari

మన తెలంగాణ/హైదరాబాద్:  సమాజంలో అట్టడుగు వర్గాల పేదలకు న్యాయం జరగాలంటే కొత్త రాజ్యాంగం రచించుకోవాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చేసిన వ్యాఖ్యలకు పూర్తి గా మద్దతు తెలుపుతున్నామని మాజీ ఉపముఖ్యమంత్రి, టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కడియం శ్రీహరి అన్నారు. ఇందులో తప్పేముందో తమకు అర్థం కావడం లేదన్నారు. పేద ప్రజలకు మేలు జరగాలంటే బిజెపిని కూకటి వేళ్లతో పెకిలించాలని సిఎం కెసిఆర్ పిలుపునివ్వడాన్ని దేశ వ్యాప్తంగా అందరు హర్షిస్తున్నారన్నారు. నిజమైన అంబేద్కర్ వారసులం తామే(టిఆర్‌ఎస్)నని, గాడ్సేకు వారసులుగా బిజెపి నేతలు కొనసాగుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. అలాంటి నేతలతో నీతులు నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం ముమ్మాటికీ బైబిల్ లాంటిదేనని… అనేక సార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్నామన్నారు.

మానవ అభివృద్ధి సూచికల్లో భారత దేశం నానాటికి వెనకబడుతోందోన్నారు. పక్కనున్న దేశాల కన్నా మన దేశం మానవాభివృద్ది సూచికల్లో బాగా వెనకబడి ఉందన్నారు. ఈ నేపథ్యంలో అసమానతలు రూపుమాపడానికి కొత్త రాజ్యాం గం అవసరముందని గట్టిగా నమ్ముతున్నామన్నారు. బుధవారం టిఆర్ ఎస్ ఎల్‌పి కార్యాలయంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, శాసనసభ్యుడు క్రాంతి కిరణ్‌లతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ, బిజెపి నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి సుమారు 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ… స్వాతం త్య్ర ఫలాలు కొంత మందికి అందుతున్నాయన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చూకూర్చడంలో కేంద్రంలో ఇప్పటి వరకు అధికారంలో కొనసాగిన పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. అందుకే సిఎం కెసిఆర్ కొత్త తరహాగా ఆలోచించారన్నారు. నేటి పరిస్థితులకు అనుకొత్తగా కొత్త రాజ్యాంగం రావాలని కోరుకుంటున్నారన్నారు.

ఇందులో విపక్షాలకు వచ్చే నష్టం ఏమిటో తనకు అర్ధం కావడం లేదన్నారు. ఈ విషయంలో విపక్షావలు అనవసరంగా సిఎం కెసిఆర్‌పై నోరు పారుసుకుంటున్నారని విమర్శించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌పై నిజంగా బిజెపికి ప్రేమ ఉంటే దేశవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా కడియం డిమాండ్ చేశారు. బిజెపి పార్టీ నూటికి నూరు శాతం దళిత, రైతు, మైనారిటీ, మహిళా వ్యతిరేక పార్టీ అని ఆయన విమర్శించారు. పేదల సంక్షేమాన్ని నిధులు ఇవ్వడానికి మనస్సురాని నరేంద్రమోడీ ప్రభుత్వం… దేశ సంపదను మాత్రం అంబానీ, ఆదానీలకు తమ ఇష్టానుసారంగా దోచిపెడుతోందని ఆరోపించారు. గిరిజనులు ఎంతో వైభవంగా జరుపుకునే సమ్మక్క సారక్క జాతరను జాతీయ పండుగగా గుర్తించేందుకు కూడా కేంద్రం వెనుకాడుతుండడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రిగా కొనసాగుతున్న జి. కిషన్‌రెడ్డి దీనిపై ఎందుకు మాట్లాడడం లేదని ఆయన నిలదీశారు.

దళిత, గిరిజనుల జనాభా దేశంలో 28 శాతం ఉంటే బడ్జెట్‌లో కేవలం రూ. 12 వేల కోట్లు కేటాయిస్తారా? అని వారు మండిపడ్డారు.రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 20 వేల కోట్లకుపైనే ఆయా వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తోందన్నారు. బిజెపి నేతలు చేతకాని దద్దమ్మలు,జీరోలని విమర్శించారు. రాష్ట్రానికి బిజెపి నేతలు చేసిందేమీ లేదన్నారు. విభజన చట్టం హామీలు బడ్జెట్‌లో ఎందుకు పెట్టించడం లేదని నిలదీశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సం జయ్ బుడ్డర్ ఖాన్, బట్టే బాజ్ మాటలని మండిపడ్డారు. ఇప్పుడున్న రాజ్యాంగంలో రిజర్వేషన్లు 50 శాతం వరకే అనుమతిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలంటే కొత్త రా జ్యాంగం అవసరముందన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే రాష్ట్రంలో కెసిఆర్ పాలన కొనసాగుతోందన్నారు. దేశంలో ఎస్‌సి, ఎస్‌టి వర్గాలకు వరుస గా కేటాయింపులు తగ్గిస్తున్న ఘనత మోడీ సర్కార్‌దేని కడియం ఎద్దేవా చేశారు. పొరుగు దేశాలు సాధిస్తున్న ప్రగతిని భారత్ సాధించడంలో ఎందుకు విఫలమవుతున్న తీరుపై ఆవేదనతోనే సిఎం మాట్లాడారన్నారు.

దేశ ప్రగతి కోసం కెసిఆర్ కొత్త రాజ్యాంగంపై చర్చను లేవనెత్తారన్నారు. దీనిపై కాంగ్రెస్, బిజెపిలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఆ పార్టీలు తమ వైఖరి చెప్పకుండా కెసిఆర్‌పై ఆందోళనలకు పిలుపునివ్వడం శోచనీయమన్నారు. రాజ్యాంగాన్ని 105 సార్లు సవరించింది కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు కాదా? అని ప్రశ్నించారు. అంబేద్కర్‌పై కెసిఆర్‌కు గౌరవం ఉండబట్టే 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నారన్నా రు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News