Monday, December 23, 2024

3 గంటలంటే రైతులు తిట్టుకుంటున్రు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ: రాష్ట్రం రాకముందు విద్యుత్ లేక పొలాలు ఎండిపోయేవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అ న్నారు. గతంలో ఎంతో మంది సిఎంలు పని చేసినా ఎందుకు విద్యుత్ ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. రై తులు ఈ విషయాన్ని ఆలోచించాలని కోరారు. గతం లో ఎక్కడ చూసినా ఇన్వర్టర్లు, జనరేట్లు ఉండేవని, ప్ర స్తుతం రాష్ట్రంలో నాణ్యమైన 24 గంటల విద్యుత్‌ను స రఫరా చేస్తున్నామని చెప్పారు. 24 గంటల విద్యుత్ ఇ వ్వడానికి అధికారులతో మాట్లాడానని, కరెంటును కొ నాల్సి వస్తుందంటే ఎంత ఖర్చయినా పర్వాలేదని చెప్పినట్లు గుర్తు చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా వి ద్యుత్ అందిస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు మూడు గం టల విద్యుత్ అంటే రైతులు తిట్టుకుంటున్నారని పేర్కొన్నారు. 24 గంటల కరెంటు ఇస్తే ఎవరికి అవసరమున్నప్పుడు వాళ్లు వాడుకుంటారని తెలిపారు. భువనగిరి డిసిసి అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సోమవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షం లో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

సిఎం కెసిఆర్ అనిల్‌కుమార్‌రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, తలసరి ఆదాయంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామన్నారు. 24 గంటల కరెంటు సరఫరాతో రాష్ట్రంలో మూడు పంటలు పండుతున్నాయని, గతంలో వడ్లు తీసుకుపోయి మార్కెట్లలో ఎదురు చూడాల్సి వచ్చేదని, ఇప్పుడు కళ్లాల వద్దనే ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు  నిండపోతుందని,దాంతో అద్భుతంగా నీళ్లొస్తాయని చెప్పారు.భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలు వజ్రపు తునకలు అవుతాయని వ్యాఖ్యానించారు. భువనగిరి, ఆలేరుకు నెత్తిమీద కుండపెట్టుకున్నట్లే మల్లన్నసాగర్ నుంచి నీళ్లొస్తాయని అన్నారు. భువనగిరి, ఆలేరులో శాశ్వతంగా కరువు అనేది రాదని, మనం బతికుండంగా చూడమని పేర్కొన్నారు. రూ.80వేల పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పు ఎప్పుడో తీరిపోయిందని చెప్పారు. ధరణి పోర్టల్ వచ్చాక అద్భుతాలు జరుగుతున్నాయని అన్నారు. ధరణి పోర్టల్‌లో భూములను డిజిటలైజ్ చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం అద్భుతంగా ఉందని వ్యాఖ్యానించారు.

వ్యవసాయ రంగం అద్భుతంగా ఉంది
రాష్ట్రంలో వ్యవసాయరంగం అద్భుతంగా ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. ధరణి పోర్టల్ తెచ్చి భూములను డిజిటలైజేషన్ చేశామని.. తద్వారా యజమానులు మాత్రమే భూమి ఇతరులకు మార్చగలరని వివరించారు. ప్రతిపక్షాలు ఆరోపించినట్లు ఇందులో ఎలాంటి అవకతవకలు జరగవని వివరించారు. తెలంగాణలో భూములు విలువ భారీగా పెరిగాయని.. రైతుల పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు. ధరణి ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ అవుతుందని.. దీనిని తీస్తే రైతుబంధు నిధులు ఎలా జమ అవ్వాలని కెసిఆర్ ప్రశ్నించారు.రాష్ట్రంలో అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల పుణ్యమా భూములు విలువ భారీగా పెరిగాయని సిఎం కెసిఆర్ వివరించారు. రూ.80 వేల కోట్లు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పు ఎప్పుడో తీరిందని సిఎం తెలిపారు.

ఒక లక్ష్యంతో ఏర్పాటైన పార్టీ బిఆర్‌ఎస్
బిఆర్‌ఎస్ రాజకీయాల కోసం కాకుండా.. ఓ లక్ష్యం కోసం పుట్టిన పార్టీ అని సిఎం కెసిఆర్ పునరుద్ఘాటించారు. గతంలో ఎంతోమంది పెద్దలు తెలంగాణ ఉద్యమంలో పని చేశారని, ఎందరో త్యాగాలు చేశారని పేర్కొన్నారు. ఆ తర్వాత ఉద్యమం నీరుగారిపోయినా.. మళ్లీ స్టార్ట్ చేసి కొట్లాడామని, ఇదంతా కండ్ల ముందు జరిగిన చరిత్ర అని వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నామని, భగవంతుడి దయ, తెలంగాణ ప్రజల అదృష్టంతో చాలాగొప్పగా రాష్ట్రాన్ని సాధించుకుంటామన్నారు. అప్పుడు చాలా తికమక పెట్టారని, హైదరాబాద్ విషయంలో కాంప్రమైజ్ కావాలని కావాలన్నారని గుర్తు చేశారు. హైదరాబాద్ లేని తెలంగాణ ఎందుకు..? తలకాయలేని మొండెం ఇస్తే మాకెందుకు అని, ప్రాణం పోయినా ఒప్పుకోమని చెప్పి.. చివరకు హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. కలబడి, పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని, తెచ్చుకున్న తెలంగాణ నిలబడాలన్నారు.

చేరో పదవితో జోడెడ్లలాగా బండిలాగితే అద్భుతంగా నడుస్తది
అనిల్‌కుమార్‌రెడ్డి కష్టపడి జీవితంలో పైకొచ్చిన వ్యక్తి అని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఎంఎల్‌ఎ శేఖర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డిలు పోటీపడి ఎందుకు డబ్బులు తగిలేస్తరు…చేరో పోస్టు తీసుకుని ఇద్దరు కలిసి గట్టిగ చేయండని తానే చెప్పినట్లు సిఎం కెసిఆర్ అన్నారు. చేరో పదవితో జోడెడ్లలాగా బండిలాగితే అద్భుతంగా నడుస్తది…ఇద్దరు కోల్యాగలాగ ఉన్నరు అని పేర్కొన్నారు. తనకు ప్రస్తుతం 69 సంవత్సరాలు అని, ఫిబ్రవరి వస్తే తనకు 70 ఏళ్లు వస్తాయని చెప్పారు. రేపటి తెలంగాణ మీది, భవిష్యత్తు మీది..యువకులు దీన్ని పాలించుకునేది మీరే…నడిపించుకునే మీరే అని వ్యాఖ్యానించారు. నేను ఒక తొవ్వదారి చూపించి ఎవరిదారి వారు పోతారని, వెయ్యేండ్లు ఎవరు బతుకుతారని అన్నారు. భువనగిరి,ఆలేరు ఒకప్పుడు కరువు ప్రాంతం ఉండేదని, ఇద్దరు కలిసి దానిని బాగుచేసుకోవాలని చెప్పారు.

అనిల్‌కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై తనదే జిమ్మదారి అని….ఒకసారి ఒక మాట చెప్పినా అంటే ప్రాణం పోయినా మాట తప్పనని అన్నారు. నాగార్జునసాగర్‌లో ఎన్నికలలో భరత్‌కు టికెట్ ఇచ్చి కోటిరెడ్డికి ఎంఎల్‌సి ఇద్దామని చెప్పానని, తన మాటను గౌరవించి ఆయన సహకరించారని గుర్తు చేశారు. తానే ఫోన్ చేసి పిలిచి కోటిరెడ్డికి ఎంఎల్‌సి ఇచ్చానని చెప్పారు. తాను ఒకసారి మాట చెప్పినా అంటే దానికి తిరుగు ఉండదని వ్యాఖ్యానించారు. శేఖర్‌రెడ్డి, అనిల్‌రెడ్డి కలిస్తే అక్కడ బస్వమైపోతదని, అక్కడ ఏమీ మిగలదని పేర్కొన్నారు. వీరిద్దరి కలయిక భువనగిరి జిల్లా ప్రగతిని చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఇప్పటికే చాలా బాగుచేసుకున్నామని, ఇంకా చేసుకోవాల్సి ఉందని తెలిపారు. పాతోళ్లు,కొత్తోళ్లు అని మనసులో పెట్టుకోకుండా శేఖర్‌రెడ్డి అందరితో కలిసి పనిచేయాలని కోరారు. ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రజలకు సేవ చేస్తూ భువనగిరి జిల్లాను భ్రహ్మాండమైన జిల్లాగా చేయాలని చెప్పారు.

బిఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నేతలు
భువనగి యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పునూతల వెంకటేశ్ యాదవ్, వలిగొండ ఎంపిపి నూతి రమేశ్ ముదిరాజ్, వలిగొండ సర్పంచ్ బోల్ల లిలతా శ్రీనివాస్, వలిగొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, వలిగొండ కాంగ్రేస్ పట్టణ అధ్యక్షులు కంకల కిష్టయ్య, భువనగిరి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లెంల జంగయ్య యాదవ్, వర్కింగ్ ప్రసిడెంట్ ఎంపిటిసి పాశం శివానంద్, మైనారిటీ ప్రసిడెంట్ ఎస్కే షరీఫుద్దీన్, నమాత్ పల్లి సర్పంచ్ శాలిని, మాజీ ఎంపిపి కుంభం వెంకట్ పాపిరెడ్డి, సింగిల్ విండో డైరక్టర్ కుంభం విద్యసాగర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వలిగొండ మండల నాయకులు బుర్రి రమేశ్ రెడ్డి, వలిగొండ మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు బాతరాజు ఉమాదేవి బాలనర్సింహ, గరిశె రవి, కాసుల వెంకటేశ్, బత్తిని సహదేవ్ గౌడ్, వార్డు మెంబర్లు ఎమ్మె శేఖర్,

రాపోలు శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పల్లెర్ల మురళి, పల్లెర్ల సహదేవ్, కిరణ్ కుమార్, కొండూరు సాయిగౌడ్, ఎస్‌సి సెల్ మండలాధ్యక్షుడు పల్లెర్ల సుధాకర్, పబ్బు సురేందర్, బత్తిని లింగయ్య, మైసోల్ల లక్ష్మినర్సు సహా భువనగిరి యాదాద్రి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంఎల్‌ఎలు పైళ్ల శేఖర్ రెడ్డి, గొంగిడి సునీత, గ్యాదరి కిశోర్ కుమార్, రవీంద్ర నాయక్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నలమోతు భాస్కర్ రావు, భూపాల్ రెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బాల్కసుమన్, జీవన్ రెడ్డి, జెడ్‌పి చైర్మన్లు ఎలిమినేటి సందీప్ రెడ్డి, బండా నరేందర్ రెడ్డి, వేం రెడ్డి నర్సింహారెడ్డి, డైరీ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ సోమా భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News