హైదరాబాద్: తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వం అని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మండిపడ్డారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవ్వేనా? అని ధ్వజమెత్తారు. ప్రభుత్వాలు మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? అని ప్రశ్నించారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో అసెంబ్లీ సమావేశాల్లో ఎలా నడుచుకోవాలో బిఆర్ఎస్ ఎంఎల్ఏ లకు కెసిఆర్ దిశానిర్దేశం చేశారు. ఉద్యమంలో తెలంగాణ తల్లి అందించిన స్ఫూర్తిని ప్రజలకు వివరించాలన్నారు. బిఆర్ఎస్ ఎంఎల్ఎలు, ఎంఎల్సీలు సమావేశాలకు రావాలని, అంశాలవారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని, రైతుబంధు తెచ్చిన ఉద్దేశం, ప్రయోజనాలను ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శలు గుప్పించారు. గురుకులాల, విద్యారంగంలో వైఫల్యాలు, మూసీ, హైడ్రా విషయంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని సూచించారు. నిర్భంద పాలన గురించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా వైఫల్యాలు ఎత్తి చూపాలని, ఫిబ్రవరి బహరింగ సభలో సర్కార్ వైఖరి ఎండగడుతామని, ఫిబ్రవరి తరువాత పార్టీలో అన్ని కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. కమిటీ ఏర్పాటు తరువాత సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని వివరించారు.
తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వం: కెసిఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -