Monday, December 23, 2024

దామోదర్ రావు మాతృమూర్తి ఆండాళమ్మ మృతిపట్ల కెసిఆర్ సంతాపం

- Advertisement -
- Advertisement -

ఆమె పార్ధివ దేహానికి నివాళులర్పించిన కెటిఆర్, హరీశ్‌రావు, కేకే, సంతోష్‌కుమార్, వద్దిరాజు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్ రావు మాతృమూర్తి ఆండాళమ్మ మృతిపట్ల బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సంతాపం ప్రకటించారు. దామోదర్ రావు కుటుంబ సభ్యులకు కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆండాళమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కెసిఆర్ ప్రార్థించారు. ఆండాళమ్మ మృతిపట్ల బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సంతాపం ప్రకటించారు. శనివారం బంజారాహిల్స్‌లోని దామోదర్ రావు స్వగృహంలో ఆండాళమ్మ పార్థివదేహానికి కెటిఆర్, హరీశ్‌ రావు నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే ఎంపిలు వద్దిరాజు రవిచంద్ర, కే.కేశవరావు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు నాయకులు ఆండాలమ్మ పార్ధివ దేహారానికి నివాళులర్పించి, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

 

Harish Rao

KK

Talasani Srinivas

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News