Saturday, November 23, 2024

హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల కెసిఆర్ సంతాపం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. పరిగి నియోజకవర్గం నుంచి పలు మార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రజాభిమానం పొందిన సీనియర్ రాజకీయ నేతగా, ప్రజలకు ఆయన చేసిన సేవలను సీఎం కొనియాడారు. కొప్పుల హరీశ్వర్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సిఎం గుర్తు చేసుకున్నారు. హరీశ్వర్ రెడ్డి కుమారుడు, పరిగి ప్రస్తుత ఎమ్మెల్యే మహేష్ రెడ్డికి, వారి కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

కాగా, గత కొంతకాలంగా నారోగ్యంతో బాధపడుతున్న కొప్పుల హరీశ్వర్ రెడ్డి శనివారం శ్వాస అందక గుండెపోటుతో కన్నుముశారు. 1994 నుండి 2009 వరకు పరిగి ఎమ్మెల్యేగా తెలుగు దేశం పార్టీ తరుపున ఆయన వరుస విజయాలు సాధించారు. 2001 నుండి 2003 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ డిప్యూటి స్పీకర్ గా పని చేశారు. 2014 ఎన్నికల్లో టీఆరెస్స్ పార్టీ నుండి పరిగి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News