Monday, January 20, 2025

కెసిఆర్ కాన్వాయ్ కు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాన్వాయ్ కు ప్రమాదం సంభవించింది. కెసిఆర్ కాన్వాయ్ లోని ఎనిమిది వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ముందు వాహనం బ్రేక్ వేయడంతో వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కాన్వాయ్ వాహనాల్లోని బిఆర్ఎస్ నేతలకు తృటిలో ప్రమాదం తప్పింది. ప్రమాదం తప్పడంతో నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించి రాష్ట్రవ్యాప్త బస్ యాత్రకు కెసిఆర్ శ్రీకారం చుట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News